Begin typing your search above and press return to search.

ఉత్తమ నటిగా సమంతకు మరో అవార్డ్..!

By:  Tupaki Desk   |   10 Dec 2021 7:33 AM GMT
ఉత్తమ నటిగా సమంతకు మరో అవార్డ్..!
X
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ''ది ఫ్యామిలీ మ్యాన్ 2'' వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజ్‌ & డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న బోల్డ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లైంగిక వివక్షకు గురయ్యే రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె నటనను ప్రశంసలతో పాటుగా అవార్డులు కూడా దక్కుతున్నాయి.

''ది ఫ్యామిలీ మ్యాన్ 2″ సిరీస్ లో మంచి నటన కనబర్చినందుకు సామ్ కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్-2021 లో డ్రామా సిరీస్ (ఫీమేల్) కేటగిరీలో సమంతకు ఈ అవార్డు లభించింది. ముంబైలో జరిగిన వేడుకలో అగ్ర కథానాయిక ఈ అవార్డ్ అందుకుంది. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.

ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ లో సమంత అద్భుతమైన నటనకు గానూ ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఐఎఫ్‌ఎం-2021) అవార్డు కూడా వరించింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిమేల్ (సిరీస్) కేటగిరీలో సామ్ ఈ అవార్డుకు ఎంపికైంది.

కాగా, భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత, సమంత కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా గడుపుతోంది. రెండు తెలుగు తమిళ ద్విభాషా చిత్రాలను లైన్లో పెట్టిన సామ్.. ఇటీవలే ‘యశోద’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ షూటింగ్ ప్రారంభించింది. ఇదే క్రమంలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' తో నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్న సమంత.. త్వరలో బాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించనుందని సమాచారం.