Begin typing your search above and press return to search.

మన జక్కన్న మరో అమెరికన్‌ ఘనత సాధించాడోచ్‌

By:  Tupaki Desk   |   10 Jan 2023 6:30 AM GMT
మన జక్కన్న మరో అమెరికన్‌ ఘనత సాధించాడోచ్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో జక్కన్న గురించి తెలిసింది. ఒక తెలుగు సినిమా దర్శకుడు ఈ స్థాయి ఘనత దక్కించుకోవడం బాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు కూడా ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది.

ఆస్కార్ ముందు ఉన్న టాలీవుడ్‌ జక్కన్న పలు అరుదైన రికార్డులను.. గౌరవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చినా రాకున్నా... ఆస్కార్‌ నామినేషన్స్ ను దక్కించుకోకున్నా కూడా జక్కన్నకు మరియు ఇతర ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్‌ సభ్యులకు దక్కుతున్న గౌరవం ఏ ఇండియన్ సినిమాలకు మరియు ఫిల్మ్‌ మేకర్స్ కు దక్కలేదు.

తాజాగా రాజమౌళి అమెరికన్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రముఖ టాక్ షో లో పాల్గొనబోతున్నాడు. లేట్‌ నైట్‌ విత్ సేత్‌ మేయర్స్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడబోతున్నాడు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ టాక్ షో కు మంచి ఆదరణ ఉంటుంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ మరియు అంతర్జాతీయ స్థాయి సెలబ్రేటీలను మాత్రమే ఈ టాక్‌ షో లో ఇప్పటి వరకు ప్రేక్షకులు చూశారు. మొదటి సారి ఒక ఇండియన్‌ స్టార్‌ డైరెక్టర్ ను ఆ షో లో ప్రేక్షకులు చూడబోతున్నారు. దీన్ని బట్టి రాజమౌళి అంతర్జాతీయ స్థాయి స్టార్‌ సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నాడు అని చెప్పుకోవచ్చు.

రాజమౌళి మరియు ఆర్ఆర్ఆర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం యూఎస్‌ఏ లో ఉన్న విషయం తెల్సిందే. జనవరి 11న జరిగే గోల్డెన్ గ్లోబ్‌ వేడుకకు హాజరు అవ్వబోతున్నారు. ఈ సినిమా మరియు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ అవార్డులకు నామినేషన్స్ ను రాజమౌళి టీమ్ దక్కించుకున్న విషయం తెల్సిందే.

అందే జక్కన్న ఆ అవార్డుల వేడుకలో పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగానే లేట్ నైట్‌ విత్‌ సేత్‌ మేయర్‌ టాక్‌ షో లో జక్కన్న సందడి చేయబోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.