Begin typing your search above and press return to search.

సినీ ప్రేమికుల కోసం మరో #AMB

By:  Tupaki Desk   |   21 Aug 2021 11:35 AM GMT
సినీ ప్రేమికుల కోసం మరో #AMB
X
సింగిల్ స్క్రీన్స్‌ థియేటర్లు తగ్గుతున్న ఈ సమయంలో మల్టీప్లెక్స్ ల సంఖ్య పెరుగుతూ ఉంది. హైదరాబాద్ లో ఎన్న మల్టీ ప్లెక్స్ లు అయినా కూడా భారీ గా జనాలు వస్తున్నారు. దాంతో పెద్ద స్టార్ కూడా భాగస్వామ్యంతో మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లో ఏషియన్స్ వారితో కలిసి మహేష్ బాబు #AMB సినిమా ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో అత్యాధునిక హంగులతో ఉన్న మల్టీ ప్లెక్స్ గా అది మంచి పేరును దక్కించుకుంది. ఇప్పుడు #AMB వారి నుండి మరో మల్టీ ప్లెక్స్ రాబోతుంది. సినీ అభిమానుల కోసం సరికొత్త ఎక్స్‌ పీరియన్స్ ను అందించడం కోసం మరో #AMB ను తీసుకు రాబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

హైదరాబాద్ లోని నానక్ రామ్‌ గూడలో ఈ రెండవ #AMB సినిమాస్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫినాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ కు సమీపంలో ఏర్పాటు చేయబోతున్న ఈ భారీ మల్టీప్లెక్స్ అతి త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. మహేష్‌ బాబు హైదరాబాద్‌ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా #AMB లో పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయంతో ఉన్నారంటూ ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌ లో #AMB మరో చైన్ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరగడంతో అతి త్వరలోనే హైదరాబాద్ బయట కూడా #AMB సినిమాస్‌ అందుబాటులోకి వస్తాయనే నమ్మకంతో అంతా ఉన్నారు.

మహేష్ బాబు ఒక వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు నిర్మాణంలో అడుగు పెట్టినా.. సమాజ సేవలో బిజీగా ఉన్నా కూడా సినీ ప్రేమికుల కోసం ఎప్పటికప్పుడు ఇలా ఏదో విధంగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నానక్‌ రామ్‌ గూడ లోని #AMB సినిమాస్ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు దారిలోనే అల్లు అర్జున్‌ నుండి కూడా ఒక మల్టీ ప్లెక్స్ రాబోతున్న విషయం తెల్సిందే.