Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'అన్నీ మంచి శకునములే'.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   20 Jun 2023 4:37 PM IST
ఓటీటీలో అన్నీ మంచి శకునములే.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..
X
సంతోష్ శోభన్ హీరోగా, నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫీల్ గుడ్ మూవీకి అందరూ ఇంప్రెస్ అయ్యారు. కాగా, ఈ మూవీ థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలోనూ ఇప్పుడు అదరగొడుతోంది.

గత నెల మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. సినిమా విడుదలైన సరిగ్గా నెలకు ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాని మంచి ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. కాగా, జూన్ 17 నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.

అమేజాన్ ప్రైమ్ లో ఇప్పటి వరకు చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కాగా, వాటిలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అన్నీ మంచి శకునములే కూడా చేరిపోయింది.

ఈ మూవీ ప్రైమ్ లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీని ఎక్కువ మంది వీక్షించారట. ప్రైమ్ లో ప్రస్తుుతం ఈ మూవీ ట్రెండ్ అవుతుండటం విశేషం. కుటుంబంతో కలిసి సరదాగా చూసి ఆనందించే సినిమా కావడంతో అందరూ ఈ మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ మూవీ విడుదలైన సమయంలో కొందరిని అమితంగా ఆకట్టుకోగా, కొందరు మాత్రం పెదవి విరిచారు. ఎక్కువ మందికి మూవీ తీసిన విధానం బాగా నచ్చింది. ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. న్యారేషన్ స్లో గా ఉండటం, కొన్ని కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు గా ఉండటం సినిమాకి మైనస్ అయ్యింది

అన్నీ మంచి శకునములే సినిమాలో సంతోష్ శోభన్ సరసన మాళవికా నాయర్ నటించింది. వీరిద్దరి పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.