Begin typing your search above and press return to search.

యువ హీరోకి ఇకపై అన్నీ మంచి శకునములే..!

By:  Tupaki Desk   |   12 July 2021 4:30 PM GMT
యువ హీరోకి ఇకపై అన్నీ మంచి శకునములే..!
X
'గోల్కొండ హైస్కూల్' సినిమాలో కనిపించిన 'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్.. 'తను నేను' చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2018లో 'పేపర్ బాయ్' సినిమాతో పలకరించిన యంగ్ హీరో.. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవల 'ఏక్ మినీ కథ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ అయింది. సంతోష్ కు హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడిన సంతోష్ శోభన్ కు వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

అభిషేక్ మహర్షి అనే డెబ్యూ డైరెక్టర్ తో ''ప్రేమ్ కుమార్'' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు సంతోష్ శోభన్. ఇప్పటికే వదిలిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉన్నాయి. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో.. ఓ యువకుడు ఫ్రస్ట్రేషన్‌ లో ఏం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి డైరెక్టర్ అభిషేక్ మహర్షి - రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి కథ అందించారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ పాటలు రాస్తున్నారు. రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ హీరోయిన్ గా సంతోష్ శోభన్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలానే 'ఓ బేబీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందినీ రెడ్డి దర్శకత్వంలో ''అన్నీ మంచి శకునములే'' అనే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు యువ హీరో. 'జాతిరత్నాలు' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన 'అన్నీ మంచి శకునములే' టైటిల్ మరియు మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు కలిగించాయి.

కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్ - రావు రమేష్ - నరేష్ - గౌతమి - రాజేంద్ర ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్వప్న సినిమా మరియు మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దావూద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయగా.. లక్ష్మి భూపాల డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు.

నేడు (జూలై 10) సంతోష్ శోభన్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మాణ సంస్థలు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ యువ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఇక నీకు 'అన్నీ మంచి శకునములే' అంటూ స్వప్న సినిమా వారు సంతోష్ కు బర్త్ డే విషెస్ అందించారు. శోభన్ కెమెరా భుజాన పెట్టుకుని నవ్వుతూ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా యంగ్ హీరో చేయబోయే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏదేమైనా ఏక్ మినీ హిట్ తో వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న సంతోష్ శోభన్ కు ఇకపై అన్నీ మంచి శకునములే అనుకోవచ్చు.