Begin typing your search above and press return to search.

ఈ సమయంలో ఇలాంటి సాహసాలు ఏంటి రజినీ సర్‌

By:  Tupaki Desk   |   29 April 2021 6:30 AM GMT
ఈ సమయంలో ఇలాంటి సాహసాలు ఏంటి రజినీ సర్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ఈ ఏడాది ఆరంభంలో తీవ్ర అనారోగ్యం పాలయిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్న సమయంలోనే అనారోగ్యం పాలవ్వడంతో అపోలోలో చికిత్స కూడా చేయించుకున్నాడు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న తాను నిర్ణయం మార్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం విషయంలో అంతటి ఆందోళన ఉన్న రజినీకాంత్‌ ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో అన్నాత్తే షూటింగ్‌ చేయడం హాట్‌ టాపిక్ గా మారింది.

స్టార్‌ లు సూపర్‌ స్టార్‌ లు అంతా కూడా సినిమా షూటింగ్‌ లను పక్కన పెట్టి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. మూడు పదుల వయసు ఉన్న హీరోలు కూడా ఇంటికే పరిమితం అయిన ఈ సమయంలో ఆరు పదుల హీరో రజినీకాంత్‌ మాత్రం షూటింగ్‌ చేయడం ఆశ్చర్యంగా ఉంది. శివ దర్శకత్వంలో అన్నాత్తే మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. రజినీకాంత్‌ తో పాటు కీర్తి సురేష్‌ మరియు నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే చెన్నై నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చి నయన్‌ అన్నాత్తే షూటింగ్‌ లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.

వయసు పైబడిన వారికి కరోనా అత్యంత ప్రమాదకరం అని పదే పదే నిపుణులు చెబుతున్నా కూడా రజినీకాంత్‌ షూటింగ్‌ లో పాల్గొనడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌ పోలీసుల ప్రత్యేక అనుమతి తీసుకుని నైట్ షూట్‌ లను కూడా అన్నాత్తే యూనిట్‌ సభ్యులు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ లో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఆ భయం లేకుండా రజినీకాంత్ షూటింగ్ కు హాజరు అవ్వడం ను మొండి ధైర్యంగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అన్నాత్తే షూటింగ్‌ జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.