Begin typing your search above and press return to search.

బాలకృష్ణకు అన్నపూర్ణ షాక్.. నిజమేనా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:59 AM GMT
బాలకృష్ణకు అన్నపూర్ణ షాక్.. నిజమేనా?
X
నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు తాను చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతుంటాయి. మొన్న వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో పాల్గొన్న బాలకృష్ణ... ఏఎన్ఆర్, ఎస్వీఆర్ లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి వర్సెస్ అక్కినేని అంటూ టాలీవుడ్ లో మళ్లీ రచ్చ మొదలైంది.

సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో... బాలకృష్ణ మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని రంగారావు ఈ రంగారావు అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తాజాగా అక్కినేని వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ రంగారావు కళామ ముద్దుబిడ్డలని అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరచుకోవడమే అంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా బాలకృష్ణపై మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రేపు ఈ షోలో భాగంగా బాలకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లాల్సి ఉంది. రేపు జరగాల్సిన ఆహా షూటింగ్ ను ఆహా టీం పోస్ట్ పోన్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆహా టీంకు ఓ సందేశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణను రానివ్వలేము అని ఆహా టీంకు అన్నపూర్ణ స్టూడియో పంపినట్లు సోషల్ మీడియాలో ఊఆ టాక్ వైరల్ గా మారింది. ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియదు.

ఇలా ఉంటే బాలకృష్ణ వ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలు ఇప్పటివరకు స్పందించలేదు. మరింత వివాదంగా మారకముందే సినీ పెద్దలు అడుగు ముందుకు వేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ మాత్రం స్పందించారు. దీనిపై నాగార్జున ఏమంటారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.