Begin typing your search above and press return to search.

#అన్నాథే: ఒంటి చేత్తో బుల్లెట్టు న‌డుపుతూ రాజాలా క‌త్తి దూసిన ర‌జ‌నీ

By:  Tupaki Desk   |   11 Sep 2021 4:30 AM GMT
#అన్నాథే: ఒంటి చేత్తో బుల్లెట్టు న‌డుపుతూ రాజాలా క‌త్తి దూసిన ర‌జ‌నీ
X
70 ఏజ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సాహ‌సాలు చూశారా? రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేస్తూ రేస్ బైక‌ర్ లా మాస్ రాజాలా క‌నిపిస్తున్నాడు. పైగా ఒక చేత్తో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ క‌త్తిని చేత‌ప‌ట్టి శ‌త్రువుమీదికి ఉరుకుతున్నాడు. అస‌లు ఈ ఏజ్ లో ఇంత లాఘ‌వం ఎలా సాధ్యం ర‌జ‌నీ? అని అడ‌గ‌ని వాడు ఉంటాడా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన `అన్నాథే` మొద‌టి పోస్ట‌ర్ లీకు అయిన‌ప్ప‌టి నుంచి ఒక‌టే అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఎప్ప‌టిక‌ప్పుడు అధికారిక పోస్ట‌ర్ల‌తోనూ టీమ్ వేడి పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. వినాయ‌క చ‌వితి ఫ‌ర్వ‌దినాన క‌నీస‌మాత్రంగా సాంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపిస్తాడులే అనుకుంటే అత‌డు మ‌రీ ఇలా యాంగ్రీ యంగ్ మేన్ లా ఫ్యాక్ష‌నిస్టులా క‌త్తి ఝ‌లిపిస్తున్నాడేమిటో! సూపర్ స్టార్ లుక్ ను ఆవిష్కరిస్తూ అన్నాథే పోస్టర్ ను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసింది. ఈ కొత్త పోస్టర్ మొదటి లుక్ కి భిన్నంగా ఉంది. బుల్లెట్ పై ర‌జ‌నీ హెల్మెట్ ధ‌రించి .. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ క‌నిపిస్తున్నాడు.

చూస్తుంటే ఇది హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ లో తెర‌కెక్కించిన భారీ యాక్ష‌న్ స‌న్నివేశం ఇద‌ని అని అర్థ‌మ‌వుతోంది. అన్నాథే చిత్రానికి ద‌రువు శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అజిత్ తో వ‌రుస హిట్ల త‌ర్వాత అత‌డు ర‌జ‌నీని మాస్ యాక్ష‌న్ అవ‌తారంలో ఆవిష్క‌రిస్తున్నారు. నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నయనతార- కీర్తి సురేష్- ప్రకాష్ రాజ్- మీనా- ఖుష్బు సుందర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

పూర్తి ఆరోగ్యం ఎన‌ర్జీతో ర‌జ‌నీ రూలింగ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాథే` షూటింగ్ లో బిజీగా ఉండ‌గానే ఆయ‌న స‌డెన్ గా అమెరికా వెళ్లార‌ని ప్ర‌చారం సాగింది. దీనిపై అభిమానుల్లో కొంత కంగారు క‌నిపించింది. ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందో అంటూ కంగారు ప‌డ్డారు. అయితే అన్ని సందేహాల‌కు చెక్ పెడుతూ ఆయ‌న అమెరికాలో దాదాపు 3 వారాలు సెల‌వులు గడిపిన తరువాత చెన్నైకి తిరిగి వచ్చారు. వందలాది మంది అభిమానులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమాన తలైవర్ కోసం ఎదురు చూశారు. ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత అభిమానులు సంతోషించారు.

ర‌జ‌నీ అతని భార్య లతా ప్రసిద్ధ మాయో క్లినిక్ లో హెల్త్ చెక‌ప్ కోసం అమెరికా వెళ్లారని ఆ త‌ర్వాత తెలిసింది. ఈ ఏడాది జూన్ లో ర‌జ‌నీ అమెరికాను విజిట్ చేశారు. రజినీ తిరిగి చెన్నైకి రాగానే త‌దుప‌రి పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ తన భర్త ధనుష్ తో కలిసి రస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ చిత్రం `ది గ్రే మ్యాన్` చిత్రీకరణలో పాల్గొన్నారు. అస‌లు క‌రోనా అనే భ‌యం లేకుండానే ర‌జ‌నీ సాహ‌సాల‌కు పూనుకోవం అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆయ‌న ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `అన్నాథే` దీపావళి కానుక‌గా ట్రీటిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంటే అభిమానుల్లో జోష్ నెల‌కొంది. ర‌జ‌నీ కోసం ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది డైరెక్ట‌ర్లు వేచి చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇందులో ప‌లువురు సీనియ‌ర్లు ఉండ‌గా కొత్త కుర్రాళ్లు కూడా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ర‌జ‌నీ 80 వ‌చ్చే లోపే మ‌రో డ‌జ‌ను పైగా సినిమాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.