Begin typing your search above and press return to search.

రస్నా బేబి పెళ్లి ఫిక్స్‌

By:  Tupaki Desk   |   7 Nov 2015 10:20 AM IST
రస్నా బేబి పెళ్లి ఫిక్స్‌
X
'ఐ లవ్‌ యూ రస్నా' అంటూ రస్నా బేబీగా బుల్లితెర ప్ర‌క‌ట‌న‌ల్లో సంద‌డి చేసింది అంకిత‌. ఆ త‌ర్వాత‌ లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో హీరోయిన్‌ గా తెలుగు తెరకు పరిచయమైంది. మొద‌టి సినిమాతోనే యూత్ గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. ప్రేమ‌క‌థా చిత్రాలలో రొమాంటిక్ క్యారెక్ట‌ర్‌ ల‌తో కెరీర్‌ ని సాగించింది. ప్రేమలో పావని కళ్యాణ్‌ - ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ - సింహాద్రి - విజయేంద్రవర్మ వంటి చిత్రాల్లో తనదైన‌ నటనతో ఆకట్టుకుంది.

అప్ప‌టికి యంగ్ హీరోయిన్ల‌లో గ్లామ‌ర్ కంటెంట్‌ తో యూత్‌ ని పిచ్చెక్కించింది. గ్లామర‌స్‌ హీరోయిన్‌ గా తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిటీ తెచ్చుకుంది. అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన అంకిత సడన్‌ గా అమెరికా వెళ్లిపోయింది. ప్ర‌ఖ్యాత‌ యూనివర్సల్‌ స్టూడియోలో సినిమా టెక్నాలజీ పై స్ట‌డీ చేసింది. కొందరు హాలీవుడ్‌ డైరెక్టర్స్ వ‌ద్ద శిష్య‌రికం చేసింది. సినిమా టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఉత్సాహం వెనుక ఫ్యూచర్‌ లో డైరెక్టర్‌ అవ్వాలన్న ఉద్దేశం వుందో ఏమో తెలీదుగానీ, ఇప్పుడు మాత్రం పెళ్ళికి రెడీ అయింది.

న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ ను పెళ్ళాడబోతోంది. నిన్న‌టి ఉద‌య‌మే.. ఉదయం ముంబైలోని జె.పి. మారియట్‌ హోటల్‌ లో పెద్దల సమక్షంలో అంకిత, విశాల్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. మొత్తానికి ర‌స్నా బేబి పెళ్లికి సిద్ధ‌మైంది. కంగ్రాట్స్ టు అంకిత‌.