Begin typing your search above and press return to search.

'అది ఆమె కర్మ'.. రియా అరెస్ట్ పై సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్...!

By:  Tupaki Desk   |   8 Sep 2020 5:36 PM GMT
అది ఆమె కర్మ.. రియా అరెస్ట్ పై సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్ డీలర్స్ బాసిత్ పరిహార్ - కైజెన్ ఇబ్రహీం - రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి - సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిండా.. దీపేష్ సావంత్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రెండు రోజులుగా రియా చక్రవర్తిని విచారించిన ఎన్సీబీ అధికారులు.. ఈ రోజు రియాను కూడా అరెస్ట్ చేసారు.

కాగా, డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ అవడంపై సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే స్పందించింది. ఇన్స్టాగ్రామ్ లో 'జస్టిస్' అంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. ''ఏదీ అనుకోకుండా దానంతట అదే జరగదు. నీ చర్యల ద్వారా నీ విధిని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. అదే కర్మ'' అని అంకిత తన పోస్ట్ లో పేర్కొంది. అంకితా లోఖండే మొదటి నుండి కూడా సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి కారణమనే వాదన వినిపిస్తూ వచ్చింది. సుశాంత్ తండ్రి రియాపై పాట్నాలో ఫిర్యాదు చేసిన తర్వాత తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ''నిజం గెలుస్తుంది'' అని పోస్ట్ పెట్టింది. సుశాంత్ మరణం తర్వాత అంకిత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. 'పవిత్ర రిష్తా' అనే హిందీ సీరియల్ తో సుశాంత్ తో కలిసి నటించిన అంకిత.. ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.