Begin typing your search above and press return to search.

మణికర్ణిక : నాకేం అన్యాయం జరగలేదు

By:  Tupaki Desk   |   1 Feb 2019 1:30 AM GMT
మణికర్ణిక : నాకేం అన్యాయం జరగలేదు
X
మణికర్ణిక చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తే కంగనా రనౌత్‌ ఆ క్రెడిట్‌ కొట్టేసిందని - తనకు క్రెడిట్‌ రాకుండా చేసిందని క్రిష్‌ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. తాను పూర్తి చేసిని సినిమాకు ప్యాచ్‌ వర్క్‌ చేసి మొత్తం నేనే సినిమాను చేశానంటూ చెప్పుకుంటున్న కంగనాపై సినీ వర్గాల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంగనా రనౌత్‌ పద్దతి బాగా లేదని - ఆమె క్రిష్‌ కు గుర్తింపు ఇవ్వాల్సిందని బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ పూజా భట్‌ ఇటీవలే అన్న విషయం తెల్సిందే.

ఇంకా పలువురు కూడా కంగనా తీరుపై అసహనంతో ఉన్నారు. సోనూసూద్‌ తనతో తీసిన సీన్స్‌ ను తొలగించి, ఆ స్థానంలో మరొకరితో షూట్‌ చేయడంపై ఆగ్రహంతో ఉన్నాడు. సినిమా విడుదల తర్వాత మిష్టి చక్రవర్తి కూడా తన పాత్రను చాలా వరకు తగ్గించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. క్రిష్‌ తనపై మంచి సీన్స్‌ ను షూట్‌ చేశారు. కాని కంగనా మాత్రం తన పాత్ర పరిధి తగ్గించి, తనపై షూట్‌ చేసిన సీన్స్‌ ను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్రం విషయంలో క్రిష్‌ కు అన్యాయం జరిగిందని కూడా మిష్టి పేర్కొంది.

అంతా కంగనాపై విమర్శలు చేస్తున్న సమయంలో ఇదే సినిమాలో నటించిన అంకిత మాత్రం కంగనాపై పాజిటివ్‌ గా స్పందించింది. నేను చేసిన ఏ సన్నివేశాలను తొలగించలేదని - తాను నటించిన పూర్తి సీన్స్‌ ను సినిమాలో ఉంచారని చెప్పుకొచ్చింది. కంగనా - క్రిష్‌ వివాదం గురించి తనకు పూర్తిగా తెలియదు అని - ఆ వివాదం గురించి తాను మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చింది. అయితే కంగనా మాత్రం ఈ చిత్రానికి చాలా కష్టపడింది అంటూ అంకిత చెప్పుకొచ్చింది.