Begin typing your search above and press return to search.

పార్టీలో ఊగి తూగుతున్న హీరోగారి మాజీ ప్రియురాలు!

By:  Tupaki Desk   |   21 Dec 2020 9:00 PM IST
పార్టీలో ఊగి తూగుతున్న హీరోగారి మాజీ ప్రియురాలు!
X
బాలీవుడ్ లో పార్టీ క‌ల్చ‌ర్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ పార్టీ గురించి విస్త్ర‌తంగా మీడియాలో చ‌ర్చ సాగింది. ఇక దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయ‌సి కం టీవీ న‌టి అంకిత పార్టీ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా మారింది.

శనివారం తన 36 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అంకితా లోఖండే పార్టీలో చిలౌట్ చేస్తున్న వీడియోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతున్నాయి.

అంకిత‌కు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ స‌న్నిహితురాలు అన్న సంగ‌తి తెలిసిందే. శ్వేతాసింగ్ కీర్తి నుంచి అంకిత‌కు తాజా ప్రత్యేక విన్న‌పం ఆస‌క్తిని రేకెత్తించింది. ప్రముఖ టీవీ షో పవిత్ర రిష్టాలో అంకితా లోఖండే- సుశాంత్ కలిసి నటించారు. వారు ఆరేళ్లు డేటింగ్ చేశారు. 2016 లో విడిపోయారు. టీవీ స్టార్ ‌కు ఆలస్యంగానే పుట్టినరోజు శుభాకాంక్షలు పంచుకుంటూ శ్వేతా సింగ్ కీర్తి తన నోట్ లో ఇలా వ్రాశారు. ``నేను ఆరాధించే మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రియమైన నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అంకిత`` అని విషెస్ తెలిపారు. ఈ పోస్ట్ కి సమాధానమిస్తూ అంకిత ఇలా వ్యాఖ్యానించారు. ``మీరు ఎల్లప్పుడూ నా వైపు నిలబడ్డారు! కాబట్టి నేను ... మీరు నా బలం.. నన్ను ఇంటికి నడిపించే నావిగేటర్. నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను`` అని అన్నారు.

పుట్టినరోజును తన కుటుంబంతో ప్రియుడు విక్కీ జైన్ తో పాటు స్నేహితులు రషమి దేశాయ్- అపర్ణ దీక్షిత్ ‌తో కలిసి జరుపుకున్న అంకితా లోఖండే ఈ ఉత్సవాల నుండి ఒక వీడియోను పంచుకున్నారు.

పవిత్ర రిష్ట అనే డైలీ షోలో నటించిన తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అదే అత‌నికి ఇంటి పేరు అయ్యింది. అతని కెరీర్ పథంలో ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ- కేదార్ ‌నాథ్- చిచోర్ - సోంచిరియా వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ ‌లో సుశాంత్ మరణించారు.

శక్తి - అస్తిత్వా కే ఎహ్సాస్ కి వంటి టీవీ షోలలో అంకితా లోఖండే నటించారు. టైగర్ ష్రాఫ్- శ్రద్ధా కపూర్ - రితీష్ దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించిన `బాఘీ`లో ఆమె చివరిసారి కనిపించింది.