Begin typing your search above and press return to search.

ఆమీ పాటొచ్చి నాలుగు రోజులైనా..

By:  Tupaki Desk   |   9 March 2018 11:29 AM GMT
ఆమీ పాటొచ్చి నాలుగు రోజులైనా..
X
సినిమా పాటలు ఎంత బావున్నప్పటికి ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కి ఉండే క్రేజ్ వేరు. ఎలాంటి లిమిట్స్ లేకుండా ఇష్టం ఉన్న లిరిక్స్ తో బీట్ ని కలిపేయొచ్చు. కాస్త క్యాచిగా ఉన్నా కూడా పాటలు ఓ రేంజ్ లో హిట్ అవుతాయి. నేటి యువతరం ఎక్కువగా ప్రయివేట్ ఆల్బమ్స్ తో తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఇక అదే తరహాలో సంగీత ప్రియులని ఎంతగానో ఆకర్షిస్తున్నాడు బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు అంకిత్ తివారి.

సున్ రహ హై - తేరి గలియా వంటి సూపర్ మెలోడీస్ లతో మెప్పించిన అంకిత్ అప్పుడప్పుడు ప్రయివేట్ ఆల్బమ్స్ తో మెప్పిస్తుంటాడు. రీసెంట్ గా కొంచెం కొత్తగా అమీ జాక్సన్ తో జాతకట్టి ఓ సాంగ్ ని పాడాడు. అరబ్ స్టైల్ లో ఉన్న మెహబూబా అనే ఆ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే అంకిత్ పాటలు ఎప్పుడు రిలీజ్ అయినా మొదటి రెండు రోజులు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసేవి. నాలుగవ రోజు నుంచి ఇక పాట మారుమ్రోగిపోయేది. కానీ మెహబూబా సాంగ్ మాత్రం రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అటు అంకిత్ గొంతు.. ఇటు ఆమీ అందాలు.. రెండింటినీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మరి.

ఈ మధ్య కాలంలో అంకిత్ ప్రతి సాంగ్ హిట్ అయ్యింది. అలాగే ఆమీ అందాలు కనిపిస్తే చాలు క్లిక్కవుతున్నాయి. కానీ మెహబూబా పై ఈ సెలైన్స్ ని చూస్తుంటే ఎవ్వరికి నచ్చలేదేమో అనే టాక్ వస్తోంది. సాంగ్ ని బాగానే తెరకెక్కించారు గాని అంకిత్ అండ్ ఆమీ నుంచి ఆడియెన్స్ ఇంకా ఎక్కువ కోరుకున్నారనే కామెంట్స్ కూడా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అది సంగతి.

వీడియో కోసం క్లిక్ చేయండి