Begin typing your search above and press return to search.

ఆ మాటలే నన్ను కలిచివేశాయి.. అంటున్న సీతమ్మ

By:  Tupaki Desk   |   1 April 2020 11:00 PM IST
ఆ మాటలే నన్ను కలిచివేశాయి.. అంటున్న సీతమ్మ
X
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇంటి ఆడపడుచులకు దగ్గరైంది హీరోయిన్ అంజలి. అచ్చమైన తెలుగుదనం నిండిన అమ్మాయిగా కనిపించి చాలా మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత పెద్ద హీరోల సరసన కన్పించి అభిమానులకు అందాల విందును పంచింది. ఈ మధ్య కాలంలో సినిమాలలో కనిపించడమే కరువైంది. అప్పుడప్పుడు అడపాదడపా కన్పించినా నేను చేసిన సినిమాలేవీ ప్లాప్ కాలేదు అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఏమైందో కానీ అప్పుడప్పుడు కొందరి మాటలు మనసును నొప్పిస్తాయి అని ఫిలాసఫీ మాట్లాడుతుంది. ఇటీవలే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పుకొచ్చింది.

సీత‌మ్మ‌గా పిలిపించుకుంటున్న అంజ‌లిని సంద‌ర్భోచితంగా ఆనాటి సీత బాధపడినట్లు.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మీరెప్పుడైనా బాధపడ్డారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భగవంతుని దయ వల్ల నా సినిమాలన్నీ మినిమమ్‌ గ్యారంటీతో ఆడినవే! సినిమాల పరంగా ఎప్పుడూ బాధపడలేదు. కానీ గతంలో మా కుటుంబంలో కొన్ని సమస్యలు చర్చలకు దారితీసాయి. మా కుటుంబ విష‌యాలు బయటికి రావడం బాధగా అన్పించింది. ఆ సమయంలో నన్ను ఓదార్చినవారి కన్నా, నా పనైపోయిందని హేళ‌న చేసిన వాళ్లే ఎక్కువ. నాతో సన్నిహితంగా ఉండేవారు కూడా అలాంటి మాటలు మాట్లాడడం నాకు మ‌రింత ఆవేద‌న క‌లిగించింది’ అని అంజలి బ‌దులిచ్చారు. కొందరి మాటలు జీవితంలో ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. అలాగే అంజలి లైఫ్ లో కూడా కొందరి మాటలు బాగా కలిచివేశాయట.