Begin typing your search above and press return to search.
అంజలి పాప ఇంకెన్ని కష్టాలు పడాలో...!
By: Tupaki Desk | 25 April 2020 11:20 AM ISTప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారని మొదటి నుండి అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకి ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అచ్చ తెలుగు భామ అంజలిని హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో అంజలి.. బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’లో కథానాయికగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తరు ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమాతో ట్రాక్ లోకి వచ్చి మళ్ళీ తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని అంజలి భావించిందట. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే బోయపాటి సినిమాలో హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది.. లేకపోతే ఓవర్ ఎమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బోయపాటి ఫస్ట్ సినిమా 'భద్ర' నుండి 'వినయ విధేయ రామ' వరకు ఏ సినిమా చూసుకున్నా ఆయన సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ అలానే డిజైన్ చేయబడి ఉంటాయి. అయితే సరిగ్గా ఇలాంటి సన్నివేశాలు తీసేటప్పుడే అంజలి పాప తెగ ఇబ్బంది పడేదని ఈ సినిమా టీమ్ చెబుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ బోయపాటి రేంజ్ ఎమోషన్స్ ఏ సినిమాలోనూ అంజలి ఇవ్వలేదని చెప్పవచ్చు. ఇచ్చే అవకాశం కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సినిమా షూట్ మళ్లీ స్టార్ట్ అయితే ఈ బ్యూటీ ఇంకెన్ని కష్టాలు పడాలో అని చిత్ర బృందం ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా కనిపించడానికి ఈ పాపని కొద్దిగా బొద్దుగా అవ్వమని చెబుతున్నారట చిత్ర యూనిట్. అందరూ బొద్దుగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తుంటేనే.. పాపం కష్టపడి ఈ మధ్యే వెయిట్ లాస్ అయింది అంజలి. ఇప్పుడు బాలయ్య పక్కన నటిస్తుండటంతో మళ్ళీ వెయిట్ గెయిన్ చేయమని చెప్తుండటంతో అమ్మడు బాగా ఇబ్బంది పడిపోతోందట. మరి ఈ సినిమా పూర్తయ్యేలోపు అంజలి పాప ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూడాలి.
గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ బాలయ్య వరుస ప్లాపుల్లో ఉన్నాడు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కించిన 'ఎన్టీఆర్ కధానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఆ తర్వాత వచ్చిన 'రూలర్' కూడా నిరాశపరిచింది. మరి ఈ చిత్రం బాలయ్య - బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధిస్తారా లేదా అనేది చూడాలి. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.