Begin typing your search above and press return to search.

అసలేం జరగనట్లే మాట్లాడుతుందే

By:  Tupaki Desk   |   19 May 2019 4:47 PM IST
అసలేం జరగనట్లే మాట్లాడుతుందే
X
తెలుగమ్మాయి అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ఈమెకు ఇప్పటి వరకు మంచి కమర్షియల్‌ సక్సెస్‌ దక్కలేదు. తెలుగులో అంజలి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలో ఈమె 'లిస్సా' అనే డబ్బింగ్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌ మీడియా సమావేశంలో అంజలి మాట్లాడింది. ఈ సందర్బంగా అంజలి తన ప్రేమ విషయమై షాకింగ్‌గా కామెంట్స్‌ చేసింది.

గతంలో జై తో ఈమె ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిన రహస్యమే. వారిద్దరు అధికారికంగా ప్రేమ విషయం బయటకు చెప్పకున్నా, అందరికి తమ ప్రేమ అర్థం అయ్యేలా ప్రవర్తించారు. అయితే ఇద్దరి మద్య ఏం జరిగిందో ఏమో కాని కొన్నాళ్ల క్రితం ఇద్దరు విడిపోయారు. తాజాగా ప్రేమ విషయమై మీడియా వారు అంజలిని ప్రశ్నించగా ఆమె నేను ప్రేమలో ఉన్నట్లుగా నేను ఎప్పుడైనా మీతో చెప్పానా, నేను చెప్పని విషయం గురించి నేనెందుకు క్లారిటీ ఇవ్వాలంటూ ఎదురు ప్రశ్నించింది.

నా జీవితంలో ఏం జరుగుతుందనే విషయం నా కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలుస్తుంది. నా గురించి మీడియాలో వచ్చే వార్తలను నేను కనీసం చూసేందుకు కూడా ఆసక్తి చూపించను. నా కుటుంబ సభ్యులు కొందరు నాకు సంబంధించిన పుకార్ల గురించి చెబుతూ ఉంటారు. వారు చెప్పినా నేను లైట్‌ తీసుకుంటాను అంది. మొత్తానికి అంజలి తాను గతంలో ప్రేమలో పడనట్లు, జై అంటే తెలియనట్లే మాట్లాడుతోంది.