Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అనిత అదిరిందంతే

By:  Tupaki Desk   |   6 Jan 2016 4:26 AM GMT
ఫోటో స్టోరి: అనిత అదిరిందంతే
X
దివంగ‌త హీరో ఉద‌య్ కిర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది అనిత‌. నువ్వు - నేను - శ్రీ‌రామ్ చిత్రాల్లో అత‌డికి పెయిర్‌ గా న‌టించింది ఈ ముంబై గాళ్‌. ఉద‌య్‌ తో పెర్ ఫెక్ట్ పెయిర్ అన్న టాక్ తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాల త‌ర్వాత కెరీర్ ప‌రంగా ముందుకు సాగ‌లేక‌పోయింది. నువ్వే నువ్వే లాంటి క్లాసిక్ హిట్ అందుకున్నా.. ఎందుక‌నో కెరీర్ ప‌రంగా ఫుల్‌ స్టాప్ ప‌డింది. ఆ టైమ్‌ లోనే హిందీలో బుల్లితెర‌పై ప్ర‌వేశించి కెరీర్ బండి న‌డిపించింది.

అయితే త‌న న‌ట‌న కెరీర్‌ లో ఎప్పుడూ అన‌వ‌స‌ర‌మైన ఎక్స్‌ పోజింగ్ జోలికి వెళ్ల‌లేదు ఈ న‌టి. డీసెంట్ గాళ్ అన్న పేరు తెచ్చుకుంది. ఆ క్ర‌మంలోనే తెలుగు కుర్రాడు రోహిత్ రెడ్డిని వివాహ‌మాడి లైఫ్‌ లో సెటిలైపోయిది. అయితే లేటెస్టుగా అనిత హాట్ హాట్‌ గా ఫోజులిచ్చిన ఫోటోలు కొన్ని వెబ్‌ లోకి లీక‌య్యాయి. ఈ పిక్స్ తాజా సెన్సేష‌న్‌.

జ‌న‌వ‌రి 1 సెల‌బ్రేష‌న్స్ కోసం బాలీ వెళ్లిన అనిత అక్క‌డ పూర్తిగా గ్లామ‌ర‌స్ అవ‌తారం ఎత్తింది. బాలీ బీచ్‌ లో భ‌ర్త తో క‌లిసి దిగిన ఫోటోల్ని ఇలా ఆన్‌ లైన్‌ లో ప్ర‌మోట్ చేసుకుంది. అయితే సినిమాల్లో క‌నిపించ‌నంత హాట్‌ గా క‌నిపించేస‌రికి అనిత ఫ్యాన్స్ అంతా స‌ర్‌ప్రైజ్ అయ్యారు. ఈ రేంజులో హాట్ అప్పియ‌రెన్స్ ఇచ్చి ఉంటే .. టాలీవుడ్‌ లో స్టార్ స్టాట‌స్ అందుకుని ఉండేది క‌దా.. అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. మ‌రి అనిత ఏం చెబుతుందో?