Begin typing your search above and press return to search.

ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్ కి క‌వ‌ల‌లు

By:  Tupaki Desk   |   31 March 2019 6:00 AM GMT
ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్ కి క‌వ‌ల‌లు
X
ఉద‌య్‌ కిర‌ణ్ హీరోగా తేజ రూపొందించిన ల‌వ్‌ స్టోరీ `నువ్వు నేను`. అప్ప‌ట్లో వ‌చ్చిన ఈ సినిమా ఏ స్థాయి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో క‌థానాయిక‌గా ఉత్త‌రాది నుంచి ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది అనిత‌. ఆ త‌రువాత తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో తిరిగి మ‌ళ్లీ ఉత్త‌రాదికి వెళ్లిపోయి అక్క‌డే హిందీ సీరియ‌ల్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. ఆమె న‌టించిన `నాగిని` హిందీ సీరియ‌ల్ మంచి పాపుల‌ర్ అయింది.

ఆ మ‌ధ్య ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టించిన ఓ సినిమా ద్వారా మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాల‌నుకున్నా అనిత ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో సీరియ‌ల్స్‌ కే ప‌రిమిత‌మైన ఆమె ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రోహిత్‌ రెడ్డిని పెళ్లాడింది. మ‌ధ్యే గ‌ర్భ‌వ‌తి అయింది. దీనిపై సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ కావ‌డంతో స్వ‌యంగా అనిత‌నే ఆ విష‌యాన్ని ఓ వీడియో ద్వారా వెల్ల‌డించింది. ఇప్పుడు ఆమె డెలివ‌రీకి రెడీ అవుతోంది. 9 నెల‌లు నిండ‌టంతో ఇద్ద‌రు క‌ల‌వ‌ల పిల్ల‌ల‌కు అనిత జ‌న్మ‌నివ్వ‌బోతోంది. తాజాగా అనిత బేబి బంప్ ఫోటోలు ఇన్‌ స్టాగ్రామ్‌ లో వైర‌ల్‌ గా మారాయి.

నిండు గ‌ర్భిణిగా అనిత బేబీ బంప్‌ తో క‌నిపిస్తున్న ఫొటోలు, వీడియోలు వైర‌ల్ కావ‌డంతో అనిత త‌న బేబి బంప్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఓ హీటెడ్ పోస్ట్‌ ను షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను పండంటి క‌ల‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నాన‌ని, త‌న ఆరోగ్యం ఫిట్‌ గా వుంద‌ని, ఈ ఆనంద‌క్ష‌ణాల‌ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేక‌పోతున్నాన‌ని అనిత్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారుతోంది.