Begin typing your search above and press return to search.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన `నువ్వు నేను` బ్యూటీ

By:  Tupaki Desk   |   27 Aug 2021 5:06 PM IST
ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన `నువ్వు నేను` బ్యూటీ
X
ఉద‌య్ కిర‌ణ్ స‌ర‌స‌న తేజ ద‌ర్శ‌క‌త్వంలో `నువ్వు నేను` చిత్రంలో న‌టించింది అనితా హ‌స‌నందాని. ఆ త‌ర్వాత కూడా ఉద‌య్ కిర‌ణ్ స‌ర‌స‌న జై శ్రీ‌రామ్ అనే కాప్ డ్రామాలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ రెండు సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని విజ‌యం సాధించాయి. ఆ త‌ర్వాత అనిత కొన్ని తెలుగు సినిమాల్లో న‌టించినా కాల‌క‌మ్రంలో టాలీవుడ్ నుంచి నిష్క్ర‌మించింది.

అటుపై త‌న మూలాల్ని వెతుక్కుంటూ వెళ్లి తిరిగి హిందీ బుల్లితెర‌పైనే స్థిర‌ప‌డింది. అనితా హసానందాని - బిజినెస్ మేన్ రోహిత్ రెడ్డి ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిన‌దే. ఈ జంట ఆద‌ర్శ దాంప‌త్యానికి చిహ్నంగా ఒక పండంటి కుమారుడు జ‌న్మించాడు. ఈ జోడీ జాలీ లైఫ్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ లు వీడియోలు అంత‌ర్జాలంలో రెగ్యుల‌ర్ గా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మాల్దీవుల వెకేష‌న్ నుండి పోస్ట్ కార్డ్ లను పంచుకున్నారు. 2010 నుండి ఆమె పాదా క్రాంతం అని రోహిత్ రెడ్డి వ్యాఖ్య‌ను జోడించారు.

గత నెలలో హిమాచల్ ప్రదేశ్ లో వెకేష‌న్ ని ఎంజాయ్ చేసిన‌ ఈ జంట కొన్ని రోజుల క్రితం ద్వీప దేశమైన మాల్దీవులకు వెళ్లారు. అక్క‌డి నుండి వ‌రుస‌గా ఫోటోలను చురుకుగా పంచుకుంటున్నారు. అనిత వారి కుమారుడు ఆరవ్ తో సంతోషంగా ఉన్న ఫోటోని పంచుకున్నారు. అనిత బీచ్ వేర్ ధరించి తన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ జంట ఫిబ్రవరి 9 న తమ తొలిగా మగబిడ్డకు స్వాగతం పలికారు. రోహిత్ రెడ్డి అరుదైన‌ పోస్ట్ తో పెద్ద ప్రకటన చేశారు.

అనిత హసానందాని 2013 సంవత్సరంలో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఆమె ప్రముఖ టీవీ షోలైన యే హై మొహబ్బతీన్- కభీ సౌతాన్ కభీ సహేలీ - కావ్యాంజలి లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కుచ్ తో హై - కృష్ణ కాటేజ్ వంటి సినిమాలలోనూ నటించింది. అనిత చివరిసారిగా నాగిన్ అనే టీవీ షోలో కొన్ని ఎపిసోడ్ల‌లో కనిపించింది. ఆమె విశాఖ ఖన్నా పాత్రను పోషించింది. వ్యాఖ్యాత‌గా టీవీ కార్యక్రమాలు కాకుండా వీర కన్నడిగ- ఆడంతే అదో రకం- యే దిల్ - హీరో చిత్రాల్లో న‌టించారు. తెలుగు- కన్నడ - హిందీ చిత్రాలలో నటించారు.