Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ హీరోయిన్ కు మ‌రో ఛాన్స్‌

By:  Tupaki Desk   |   29 March 2016 5:15 PM GMT
ప‌వ‌న్ హీరోయిన్ కు మ‌రో ఛాన్స్‌
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించ‌క‌పోయినా.. ప‌వ‌న్ హీరోయిన్ గానే ముద్ర వేయించుకుంది అనీషా ఆంబ్రోస్‌. అత‌డితో క‌లిసి న‌టించిన హీరోయిన్ల కంటే బాగా పాపుల‌ర్ అయిందామె. అనీషా గురించి మాట్లాడే ప్ర‌తిసారీ ఆటోమేటిగ్గా ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చేస్తుంది. ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సీక్వెల్ కు ముందుగా హీరోయిన్ గా అనుకున్న‌ది అనీషానే అన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌పై ప‌వ‌న్ అభిమానుల్లో వ‌చ్చిన వ్య‌తిరేక‌తే ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ‘గోపాల గోపాల’లో ఓ చిన్న స‌న్నివేశంలో క‌నిపించి ప‌వ‌న్ సినిమాలో చేశాను అనిపించుకున్న అనీషా.. ఈ మ‌ధ్యే ‘ర‌న్’ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించింది.

ర‌న్ మూవీతో త‌న ఫేట్ మొత్తం మారిపోతుంద‌ని ఆశించిన అనీషాకు నిరాశే ఎదురైంది. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్యూర్ అనిపించుకుంది. సినిమాలో అనీషా న‌ట‌న‌కు కూడా మంచి పేరేమీ రాలేదు. అయిన‌ప్ప‌టికీ హీరోయిన్ గా మ‌రో అవ‌కాశం మాత్రం ప‌ట్టేసింది అనీషా. యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న ఓ సినిమాలో క‌నిపించ‌బోతోంది అనీషా. నాని అనే యువ ద‌ర్శ‌కుడితో రాజ్ త‌రుణ్ ఓ సినిమా క‌మిటైన సంగ‌తి తెలిసిందే. అందులోనూ అనీషానే హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఐతే రాజ్ త‌రుణ్ ప‌క్క‌న అనీషా సూట‌వుతుందా అన్న డౌట్లున్నాయి. ఆమె ప‌క్క‌న రాజ్ మ‌రీ లేత‌గా క‌నిపిస్తాడేమో. కాదంటారా?