Begin typing your search above and press return to search.

గ్లామర్‌ డోర్లు ఓపెన్‌ చేసేస్తోంది

By:  Tupaki Desk   |   23 March 2016 10:02 AM IST
గ్లామర్‌ డోర్లు ఓపెన్‌ చేసేస్తోంది
X
ఫిలిం ఇండస్ర్టీ అంటే అంతే. హీరోయిన్లు అన్నాక కాస్తంత గ్లామర్‌ ఆరబోయాల్సిందే. ఎక్కడో ఒక్క నిత్యామీనన్‌ వంటి బేబీలకు తప్పిస్తే.. మిగిలిన వారికి పెద్దగా వర్కవుట్‌ కాదు. ఇప్పుడు మన డిస్కషన్‌ విషయానికొస్తే.. అమ్మడు అనీషా ఆంబ్రోస్‌ ఉంది చూడండి.. ఇప్పుడు ఈవిడ గ్లామర్‌ గేట్లు ఎత్తేయడానికి రెడీ ఉన్నట్లు హింటులిస్తోంది.

అప్పట్లో ఎలియాస్‌ జానకి సినిమా చేసిన తరువాత.. నేను గ్లామర్‌ కు దూరం అనడంతో అమ్మడివైపు చూసిన టాలీవుడ్‌ దర్శకులే లేకుండా పోయారు. అయితే సడన్‌గా పవన్‌ కళ్యాణ్‌ తన సర్దార్ లో ఛాన్సిచ్చాడనగానే అమ్మడికి వెంటనే రెడ్‌ కార్పెట్‌ వేస్తుంది మన టాలీవుడ్‌ అనుకున్నా.. అది కూడా వర్కవుట్‌ కాలేదు. అయితే ఇప్పుడు సర్దార్‌ మిస్సయ్యి.. రన్‌ సినిమాతో వస్తున్న అనీషా.. సినిమాలో ఎటువంటి గ్లామర్‌ ఆరబోసిందో తెలియదు కాని.. ప్రమోషన్లలో మాత్రం బాగా హాటుగానే కనిపిస్తోంది.

మొన్న ఈ సినిమాకు సంబంధించి.. బెజవాడ అంటూ వచ్చిన ఒక మేకింగ్‌ వీడియోలో అమ్మడు నాభి అందాలను ఆరబోసింది. చూస్తుంటే గ్లామర్‌ గురించి ఒక డెసిషన్‌ తీసుకున్నట్లు అనిపిస్తోంది కదూ.