Begin typing your search above and press return to search.

మోస్ట్ హైపుడ్ హీరోయిన్.. బ్రేక్ వస్తదా?

By:  Tupaki Desk   |   24 July 2016 5:00 PM IST
మోస్ట్ హైపుడ్ హీరోయిన్.. బ్రేక్ వస్తదా?
X
'ఎలియాస్ జానకి' సినిమాతో హీరోయిన్ గా మారింది వైజాగ్ బ్యూటి అనీషా అంబ్రోస్‌. ఆ తరువాత అమ్మడికి పెద్దగా అవకాశాలేం రాలేదు. కాని సడన్‌ గా గబ్బర్ సింగ్ సీక్వెల్లో ఆమె నటిస్తోంది అనే న్యూస్ రాగానే ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయింది. మోస్ట్ హైపుడ్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేదు. కాని చివరకు ఆమెను రీప్లేస్ చేసి కాజల్ అగర్వాల్ ను లైన్లోకి దించాడు పవర్ స్టార్. పాపం అనీషా బ్యాడ్ లక్‌.

ఆ తరువాత అమ్మడికి బ్రేక్ వచ్చే సినిమాలు ఏమన్నా ఉన్నాయా అంటే.. ముందుగా సందీప్‌ కిషన్ ''రన్‌'' సినిమాతో విచ్చేసింది. ఆ సినిమా ఫ్లాపైంది. దానితో అమ్మడికి బ్రేక్ రాలేదు. ఇప్పుడిక మోహన్ లాల్ మెయిన్ లీడ్లో చంద్రశేఖర్‌ ఏలేటి తీసిన ''మనమంతా'' సినిమాతో విచ్చేస్తోంది. ఈ సినిమాతోనైనా బ్రేక్ రావాలి అమ్మడికి. మొదట్లో గ్లామరస్ పాత్రలంటే దూరంగా ఉన్నానని చెప్పింది కాని.. ఈ మధ్యన వాటికి కూడా ఓకే అనేస్తోందట. కాని బ్రేక్ మాత్రం రావట్లేదు.

ఇకపోతే తమిళంలో కూడా అనీషా ఆంబ్రోస్‌ కాస్త గాట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి అక్కడైనా ఏదైనా మాంచి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.