Begin typing your search above and press return to search.

పవన్ పుణ్యం.. ఆ హీరోయిన్‌కు మరో ఛాన్స్

By:  Tupaki Desk   |   14 July 2015 7:14 PM GMT
పవన్ పుణ్యం.. ఆ హీరోయిన్‌కు మరో ఛాన్స్
X
అలియాస్ జానకి అనే సినిమా ఒకటి తెలుగులో విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఐతే ఆ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అనీషా ఆంబ్రోస్ పవన్ కళ్యాణ్‌కు తెగ నచ్చేసింది. గబ్బర్‌సింగ్-2లో తనతో నటించడానికి చాలామంది స్టార్ హీరోయిన్లు సిద్ధంగా ఉన్నా.. పవన్ మాత్రం ఈ అమ్మాయినే హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. పవన్ ఫ్యాన్స్‌కు ఈ అమ్మాయి ఏమాత్రం నచ్చకున్నా.. అనీషాను తప్పించాలంటూ సోషల్ మీడియాలో పోరాటం కూడా చేసినా.. పవన్ మనసు మారలేదు. ‘గోపాల గోపాల’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ కూడా చేయడంతో అనీషా మీద పవన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు స్పష్టమైంది.

గబ్బర్‌సింగ్-2 రెగ్యులర్ షూటింగ్ సంగతేంటో తెలియకపోయినా.. ఇంతలోనే అనీషాకు మరో మంచి అవకాశం దక్కింది. కన్నడ నాట హీరో తిలక్ సరసన ఓ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికైంది అనీషా. నవనీత్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. పవన్ సరసన నటించిన హీరోయిన్లకు కన్నడ సినిమాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. కృతి కర్బందా, నికీషా పటేల్ లాంటి వాళ్లు అక్కడికెళ్లి ఫుల్ బిజీ అయిపోయారు. అనీషా కూడా వాళ్ల బాటలోనే శాండిల్‌వుడ్‌ను దున్నేస్తుందేమో చూడాలి.