Begin typing your search above and press return to search.

పవన్‌ కొత్తమ్మాయి కావాలంటున్నాడా?

By:  Tupaki Desk   |   24 Jun 2015 6:34 AM GMT
పవన్‌ కొత్తమ్మాయి కావాలంటున్నాడా?
X
గబ్బర్‌సింగ్‌2లో కథానాయిక మారిందా? పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు కొత్తమ్మాయి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడా? అవుననే మాట్లాడుకొంటున్నారు ఫిల్మ్‌నగర్‌ జనాలు. కొన్నాళ్ల క్రితం అందరినీ షాకింగ్‌కి గురిచేస్తూ పవన్‌కల్యాణ్‌ తన సరసన నటించేందుకు కొత్తమ్మాయి అనీషా ఆంబ్రోస్‌ని ఎంపిక చేసుకొన్నాడు. స్టార్‌ కథానాయకులంతా పవన్‌తో కలిసి నటించేందుకు పోటీపడుతున్న టైమ్‌లో ఓ కొత్తమ్మాయికి ఛాన్సిచ్చి పవన్‌ ఎవ్వరికీ అర్థం కాడు అని నిరూపించుకొన్నారు. 'గోపాల గోపాల' సినిమాలో అనీషా అందాన్ని, నటనని చూసి పవన్‌ ఆమెకి ఛాన్సిచ్చాడట. ఆ సినిమాలో అనీషా టీవీ యాంకర్‌గా వెంకటేష్‌ని ఇంటర్వ్యూ చేస్తూ కనిపిస్తుంటుంది. మొత్తంగా అనీషా లక్కీ ఛాన్స్‌ని కొట్టిందని అంతా మాట్లాడుకొన్నారు. స్టార్‌ హీరోయిన్లు సైతం అనీషాని చూసి కుళ్లుకున్నారు.

అయితే ఇటీవలే 'గబ్బర్‌సింగ్‌2' నుంచి అనీషాని తప్పించినట్టు సమాచారం అందుతోంది. అనీషా ఆ పాత్రకు తగ్గట్టుగా, పవన్‌ సరసన సెట్టవ్వట్లేదని చిత్రబృందం గ్రహించిందట. దీంతో ఆమెని తప్పించి ఆ స్థానంలో మరో హీరోయిన్‌ని ఎంపిక చేసుకొనే పనిలో చిత్రబృందం నిమగ్నమైనట్టు సమాచారం. ఈసారి కథానాయికని సెలెక్ట్‌ చేసుకొనే బాధ్యతని దర్శకుడికే అప్పగించాడట పవన్‌. మొత్తానికి అందివచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది అనీషా. మరి తదుపరి పవన్‌ సరసన నటించే ఛాన్స్‌ ఏ సుందరాంగికి అందుతుందో చూడాలి.