Begin typing your search above and press return to search.

ఒకేసారి రెండు సినిమాలకు వర్క్ చేస్తున్న యంగ్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 12:30 AM GMT
ఒకేసారి రెండు సినిమాలకు వర్క్ చేస్తున్న యంగ్ డైరెక్టర్..!
X
'అలా ఎలా' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అనీష్ కృష్ణ. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత యువ హీరో రాజ్ తరుణ్ తో 'లవర్' అనే సినిమా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అనీష్ కృష్ణ పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించలేదు. కానీ రెండేళ్ల గ్యాప్ తీసుకున్న అనీష్ ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ముందుగా యంగ్ హీరో నాగశౌర్య తో ఓ మూవీ ప్రారంభించాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు. ఇది నాగశౌర్య హోమ్ బ్యానర్ లో వస్తున్న నాలుగో సినిమా. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేసాడు అనీష్.

శ్రీ విష్ణు - రాజేంద్ర ‌ప్ర‌సాద్ ప్రధాన పాత్రలతో ''గాలి సంపత్" అనే సినిమా స్టార్ట్ చేశాడు అనీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ ఎస్. క్రిష్ణ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అరకులో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు 'గాలి సంపత్' మరియు నాగశౌర్య సినిమాల కోసం అనీష్ కృష్ణ ఒకేసారి వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి 'లవర్' వంటి ప్లాప్ సినిమా తర్వాత ఒకేసారి ఇద్దరు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న అనీష్.. ఇద్దరికీ హిట్ ఇస్తాడేమో చూడాలి.