Begin typing your search above and press return to search.

అనిరుధ్ కి బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   1 March 2018 10:24 PM IST
అనిరుధ్ కి బంపర్ ఆఫర్
X
కొలవెరి ఢీ పాటతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు అనిరుధ్ రవిచందర్. 19 ఏళ్లకే సంగీత దర్శకత్వం మొదలుపెట్టి... తమిళంలో మంచి పాటల్నే అందించాడు. ధనుష్ తో త్రీ సినిమా కోసం పనిచేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలో ఛాన్సు కొట్టేశాడు.

పిజ్జా సినిమా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. ఆ సినిమా తరువాత పెద్ద సినిమాలేవీ తీయలేదు. చిన్నా చితకా తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్ సినిమాకు పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. అదే సినిమా అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. సన్ పిక్చర్ అధికారికంగా ఈ విషయాన్ని చెప్పింది. అనిరుధ్‌కు తన కెరీర్‌ లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు. అంతేకాకుండా తలైవాతో తొలిసారి పనిచేయనున్నాడు.

అనిరుధ్ ఇప్పటికే అజిత్ (వివేగం) - అజయ్ (కత్తి)లకు సంగీతం అందించాడు. ఇక కార్తీక్ సుబ్బరాజుతో పనిచేయడం ఆ కుర్రాడికి ఇదే తొలిసారి. మొత్తమ్మీద తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు కుర్రాళ్లు సూపర్ స్టార్ సినిమాకు పనిచేసే అవకాశాన్ని చాలా సులువుగా దక్కించుకున్నారు. అన్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’సినిమాకు కూడా అనిరుధే సంగీతం అందించాడు. ఓ రెండు ఫర్వాలేదనిపించినా... ఆల్బమ్ పెద్దగా హిట్టవ్వలేదు.