Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కొత్త సినిమా కబుర్లు

By:  Tupaki Desk   |   27 Aug 2017 11:16 AM IST
ఎన్టీఆర్ కొత్త సినిమా కబుర్లు
X
ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ చిత్రంతో పాటు.. బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమా షూటింగ్.. మరోవైపు రియాల్టీ షో హోస్టింగ్ ను ఫుల్ పేస్ తో చేసేస్తున్నాడు. వచ్చే నెల 21న జై లవ కుశ రిలీజ్ కానుండగా.. ఇంకా ఆ సినిమాకు ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే యంగ్ టైగర్ కొత్త సినిమాపై జనాల్లో ఓ అంచనా ఉంది.. టాలీవుడ్ లో కూడా అదే టాక్ వినిపిస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఖాయమే అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. వీరిద్దరూ ఇప్పటికే చర్చలు పూర్తి చేసేశారని.. ప్రాజెక్టు కచ్చితంగా పట్టాలెక్కుతుందనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ లో ప్రారంభించాలని ముహూర్తం కూడా పెట్టేసుకున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. ఆ మూవీ పనులు పూర్తవగానే ఎన్టీఆర్ సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరే సినిమాకు సైన్ చేయలేదు కాబట్టి.. సెప్టెంబర్ చివరలో జై లవ కుశ రిలీజ్ తర్వాత.. త్రివిక్రమ్ తో రెగ్యులర్ గా సిట్టింగ్స్ వేస్తాడని అంటున్నారు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన టెక్నికల్ టీం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.