Begin typing your search above and press return to search.

బాబూ చిట్టీ! బన్నీకైనా చేస్తావా?

By:  Tupaki Desk   |   19 March 2016 12:35 PM IST
బాబూ చిట్టీ! బన్నీకైనా చేస్తావా?
X
అనిరుధ్ అని ఓ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఒకే ఒక్క పాటతో ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిపోయాడు. అప్పట్లో వచ్చిన 'కొలవరీ డీ' సాంగ్ తో అనిరుధ్ పేరు మార్మోగిపోయింది. దేశంలోనే అత్యధిక వ్యూస్ కలిగిన ఆల్బంగా రికార్డ్ సృష్టించి, అక్కడే నిలబడ్డ పాట ఇది. దీని తర్వాత ఈ కుర్ర కంపోజర్ కి ఆఫర్లు వరదలా వచ్చాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ లెక్కకు మించిన సినిమా ఆఫర్లు తలుపుతట్టాయి.

అయితే, ఇతగాడు మాత్రం తమిళ్ కే ప్రాధాన్యమిచ్చి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మధ్యలో రెండు టాలీవుడ్ మూవీస్ విషయంలో హ్యాండ్ ఇచ్చిన హిస్టరీ కూడా అనిరుధ్ సొంతం. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రానికి ఫస్ట్ ఆప్షన్ అనిరుధ్. కానీ.. అజిత్ వేదాళం మూవీ చేతికి రావడంతో.. చెర్రీ సినిమా చేయలేనని అనిరుధ్ హ్యాండ్ ఇచ్చాడు. ఇతడు తప్పుకోవడంతో ఆ మూవీ థమన్ చేతిలోకి వెళ్లింది. సూపర్బ్ ఆల్బం ఇచ్చి తనకొచ్చిన ఆఫర్ ని విజయవంతం చేశాడు థమన్. ఆ తర్వాత అ..ఆ.. మూవీ కోసం త్రివిక్రమ్ కూడా అనిరుధ్ నే ఎంచుకున్నాడు.

కొంత వర్క్ పూర్తయ్యాక.. సడెన్ గా ఇతడిని తప్పించి మిక్కీ జే మేయర్ ను తీసుకున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ - లింగుస్వామిల సినిమాకి కూడా అనిరుధ్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఇది తెలుగు - తమిళ్ బైలింగ్యువల్ కాబట్టి.. మరి దీన్నైనా కంప్లీట్ చేస్తాడో.. లేక హిస్టరీ రిపీట్స్ అంటూ.. టాలీవుడ్ సినిమాకి హ్యాండ్ ఇస్తాడో చూడాలి.