Begin typing your search above and press return to search.
పవన్ కంపోజర్ పాటను బ్యాన్ చేస్తారా?
By: Tupaki Desk | 5 Jan 2018 9:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఈ సారి పొంగల్ పోటీలో నిలిచాడు. తానే సెరేంద్ర కూట్టం అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేయగా.. ఇదే మూవీ తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుదల అవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉండగా.. ఇప్పుడు ఓ వివాదం ఈ మూవీని చుట్టుముట్టింది.
సంక్రాంతికి తెలుగులో విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసికి కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సంగీత దర్శకుడు సూర్య మూవీ తానా సెరేంద్ర కూట్టంకి కూడా మ్యూజిక్ ఇచ్చాడు. అనిరుధ్ కంపోజిషన్ లో వచ్చిన సొడక్కు సాంగ్ సూపర్ హిట్ గా అయింది. ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట చుట్టూ ఇప్పుడు వివాదం అలముకుంది. ఈ పాటలో ఒక లైన్ పై తమిళనాట రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. సంతోష్ కుమార్ అనే లీడర్.. ఏకంగా ఫిర్యాదు కూడా చేసేశాడు.
'కుర్రాళ్లు అంతా కలిసి ఓ పొలిటీషియన్ ను కొట్టండి' అనే అర్ధం వచ్చేలా ఉన్న వాక్యమే ఈ వివాదానికి మూలం. యూత్ ను చెడగొట్టడం.. వయొలెన్స్ ను సపోర్ట్ చేయడం.. ఇందుకు కేంద్రంగా నిలవడం వంటివి.. ఈ ఫిర్యాదులో కీలక అంశాలు. ఇలాంటి పాటను బ్యాన్ చేయాలని.. ఆ చిత్ర సంగీత దర్శకుడు.. నిర్మాతలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తమిళనాడు పొలిటీషియన్స్.