Begin typing your search above and press return to search.

#పీకె25.. ఆల్బమ్ మొత్తం స్పెషల్

By:  Tupaki Desk   |   16 Oct 2017 10:17 PM IST
#పీకె25.. ఆల్బమ్ మొత్తం స్పెషల్
X
కోలీవుడ్ లో తన మ్యూజిక్ తో సంచలనం సృష్టించిన యువ సంగీత దర్శకుడు అనిరుద్. ఆయన అందించిన ట్యూన్స్ ఇతర భాషల్లో కూడా చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా కొలెవెరి పాట ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యింది. కొన్ని రోజులకే చాలా పాపులర్ అయినా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటివరకు తెలుగులో డైరెక్ట్ సినిమాను చెయ్యని అతను మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటి అవకాశమే పవర్ స్టార్ తో రావడం చాలా సంతోషంగా ఉందని అనిరుద్ రీసెంట్ గా ఒక వీడియో ఇంటర్వ్యూలో చెప్పాడు. తన పుట్టిన రోజు సందర్బంగా అనిరుద్ చిత్ర విశేషాలను తెలిపాడు. ఇప్పటికే విడుదలైన 'బైటికొచ్చి' సాంగ్ చాలా బాగా వచ్చిందని అందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారని త్వరలో ఫుల్ సాంగ్ అందరికి నచ్చడం ఖాయమని చెప్పాడు. ఇక అలాంటి సాంగ్ చేయడానికి అసలు కారణం చిత్ర దర్శకులు త్రివిక్రమ్ అని చెబుతూ.. అయన తనకు గురూజీ అంటూ సంబోదించాడు.

#పికె25 సినిమాలో అదొక్క సాంగ్ స్పెషల్ కాదని ఆల్బమ్ మొత్తం చాలా స్పెషల్. త్రివిక్రమ్ గారి అభిరుచికి తగ్గట్టు సాంగ్స్ ఉంటాయని త్రివిక్రమ్ చాలా గ్రేట్ డైరెక్టర్ అని పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. ఇక టాలీవుడ్ లో తన నెక్స్ట్ సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అని.. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరో అని అనిరుద్ తెలిపాడు.