Begin typing your search above and press return to search.

‘జల్సా’ హ్యాంగోవర్ ఏమిటబ్బా...

By:  Tupaki Desk   |   10 Dec 2017 12:10 PM IST
‘జల్సా’ హ్యాంగోవర్ ఏమిటబ్బా...
X
ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘జల్సా’ బాగానే ఆడింది కానీ.. ‘అత్తారింటికి దారేది’ మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఐతే ఈ రెండింట్లో ఎక్కువ యూత్ ఫుల్ గా.. ఎక్కువ స్టైలిష్ గా ఉండేది మాత్రం ‘జల్సా’నే అని చెప్పాలి.

అందుకేనేమో త్రివిక్రమ్.. పవన్ ఈ సినిమానే ఎక్కువ ఇష్టపడుతూ.. ‘అజ్నాతవాసి’కి కూడా అదే ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. ‘అజ్నాతవాసి’ నుంచి గాలి వాలుగా.. అనే పాట ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పవన్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో పవన్ ను చూస్తే ‘జల్సా’ లుక్ గుర్తుకు రాక మానదు.

ఇది చాలదన్నట్లు మరో వైపు.. ‘అజ్నాతవాసి’ ఆడియోకు సంబంధించి ఆదిత్యా మ్యూజిక్ వాళ్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో బ్యాగ్రౌండ్ చూస్తే పవన్ ‘జల్సా’ లుక్ కనిపిస్తోంది. అంతే కాక.. ‘జల్సా’ అనే టైటిల్ కూడా ఉంది. ఇందులో ఆంతర్యమేంటన్నది జనాలకు అర్థం కావడం లేదు. అనిరుధ్ కు ‘జల్సా’తో ఎలాంటి సంబంధం లేకపోయినా.. అతడున్న పోస్టర్లో ‘జల్సా’ జ్నాపకాలు పొందుపరచడంలో ఆంతర్యమేంటో?