Begin typing your search above and press return to search.
తారక్ సినిమాకు కొలవెరి సంచలనం??
By: Tupaki Desk | 10 Dec 2016 10:46 AM ISTఎన్టీఆర్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే నిర్మాత కళ్యాణ్ రామ్ నుంచి దర్శకుడు బాబీతో ఎన్టీఆర్ అనే ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలు ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ అని.. కాదు మూడు రోల్స్ చేస్తున్నాడని... ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని.. జనవరిలో షూటింగ్ అని.. ఇలా చాలా అప్డేట్స్ వస్తున్నాయ్ కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ని తీసుకున్నారనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది.
వై దిస్ కొలవెరి అంటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన అనిరుధ్.. ఇప్పుడు టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నట్లే. రీజన్స్ చెప్పకపోయినా.. బ్రూస్ లీ.. అఆ.. మూవీల నుంచి సడెన్ గా తప్పుకుని గతంలో ఇబ్బంది పెట్టాడు. అయితే.. అఆ చిత్రం కోసం త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినా.. మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమాకు అనిరుధ్ రవిచందర్ నే పట్టుకొచ్చాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈ తమిళ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎన్టీఆర్ సినిమా జనవరి చివర్లో మొదలయ్యే ఛాన్సులున్నాయి. పవన్-త్రివిక్రమ్ ల సినిమా కూడా దాదాపు అదే టైమ్ లో మొదలవుతుంది. అంటే.. రెండు తెలుగు సినిమాలకు ఈ అనిరుధ్ ఒకేసారి మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుందన్న మాట. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఒకేసారి మ్యూజిక్ ఇస్తూ.. కొలవెరి కంపోజర్.. టాలీవుడ్ లో బూమ్ లోకి వచ్చేస్తున్నాడు.