Begin typing your search above and press return to search.

కొలవెరి కుర్రాడు.. అదే పేచి

By:  Tupaki Desk   |   22 Jan 2016 11:30 AM GMT
కొలవెరి కుర్రాడు.. అదే పేచి
X
ఇంతకీ కొలవెరి డి అంటూ ప్రపంచాన్నే తన కంపోజిషన్‌ తో ఉర్రూతలూగించిన అనిరుధ్‌.. తెలుగు ప్రేక్షలను మాత్రం మరోసారి నిరాశ పరుస్తున్నాడు. నిజానికి రామ్‌ చరణ్‌ బ్రూస్‌ లీ సినిమాకు మ్యూజిక్‌ అందించాల్సిన ఈ కుర్రాడు.. అప్పట్లో చేస్తా చేస్తా అంటూ లాస్టు మినిట్‌ లో హ్యాండిచ్చేశాడు. సర్లే.. ఆ తరువాత త్రివిక్రమ్‌ రంగంలోకి దిగి ఈ కుర్రాడిని ''అ..ఆ..'' సినిమాకు లైన్‌ లోకి దించాడు. కాని ఇక్కడ కూడా పేచీయేనట.

టాలీవుడ్‌ లో లెటెస్టుగా వినిపిస్తున్న గాసిప్పుల ప్రకారం.. కొలవెరి కుర్రాడు ఇప్పుడు ''అ..ఆ..'' నుండి తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 70% షూటింగ్‌ పూర్తి చేసుకున్నా కూడా.. ఇంతవరకు మన అనిరుధ్‌ ఒక్క ట్యూన్‌ కూడా ఇవ్వలేదట. తమిళంలో ఉన్న కమిట్మెంట్ల కారణంగా ఇక్కడ హ్యాండిస్తున్నాడట. మొన్న ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసే సమయానికి నిజానికి ఒక మోషన్‌ పోస్టర్ విత్ మ్యూజిక్‌ రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు. కాని అనిరుద్‌ మాత్రం డెడ్ లైన్‌ రీచ్‌ కాలేదు. చూస్తుంటే ఇక కుర్రాడితో పనవ్వదు అని అర్ధమవ్వడంతో త్రివిక్రమ్‌ మనోడ్ని తప్పించేశాడట.

అసలు తనకు ఆప్తుడైన దేవి శ్రీ ప్రసాద్‌ ను వదిలేసి అనిరుధ్‌ ను ఎందుకు తీసుకున్నాడో తెలియదు. కాని ఇప్పుడు మాటల మాంత్రికుడు దేవి ని కాకుండా మిక్కీ జె మేయర్‌ ను ఎప్రోచ్‌ అవుతున్నాడట. అతడు కూడా కుదరకపోతే అప్పుడు దేవితో రాజీ పడే ఛాన్సుందని మరో రూమర్‌ వినిపిస్తోంది.