Begin typing your search above and press return to search.

#PK25.. హ్యాపీ అంటున్న కుర్రాడు

By:  Tupaki Desk   |   6 Nov 2016 10:57 AM IST
#PK25.. హ్యాపీ అంటున్న కుర్రాడు
X
కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తెలుగు ఎంట్రీ ఖాయమైంది. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల మూవీ రీసెంట్ గా ప్రారంభం కాగా.. ఈ చిత్రానికి సంగీతం తనే అందిస్తున్నట్లు ఈ కంపోజర్ నుంచి కూడా అనౌన్స్ మెంట్ వచ్చింది.

'ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ 25వ చిత్రంతో నా తెలుగు అరంగేంట్రం చేయడం హ్యాపీగా ఉంది. నా ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో హారికా హాసినీ బ్యానర్ పై వర్క్ చేయబోతున్నా' అంటూ ప్రకటించాడు అనిరుధ్. నిజానికి ఇలాంటి అనౌన్స్ మెంట్ ఇంతకు ముందు కూడా చేశాడు. గతేడాది సమ్మర్ టైములో రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ షూటింగ్ మొదలైనప్పుడు ఇలాగే ఫుల్లు హ్యపీ అంటూ ట్వీట్ పెట్టి తర్వాత హ్యాండ్ ఇచ్చాడు.

అప్పుడు మిస్ అయినా.. మళ్లీ ఇప్పుడు ఇంకో మెగా హీరోతోనే అరంగేట్రం చేస్తున్నాడు అనిరుధ్. అయినా.. ఈసారి తప్పించుకోవడం కష్టంలే. ఎందుకంటే.. ఒకవేళ హ్యాండ్ ఇస్తే మాత్రం.. కిడ్నాప్ చేసి పట్టుకొచ్చి మరీ వర్క్ చేయిస్తానని సమంత బెదిరించింది కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/