Begin typing your search above and press return to search.

పోలీసుల ముందు హాజరైన కుర్ర కంపోజర్‌

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:51 PM IST
పోలీసుల ముందు హాజరైన కుర్ర కంపోజర్‌
X
బీప్ సాంగ్ కారణంగా వివాదంలో చిక్కుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్.. పోలీసుల ముందు హాజరయ్యాడు. బీప్ సాంగ్ ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యి, వివాదం మొదలుకాగానే కనిపించకుండా పోయాడు ఈ కంపోజర్. అయితే.. శింబు రాసి, పాడిన పాటకు కంపోజ్ చేయడమే ఇతను చేసిన నేరం.

వివాదం నానాటికీ ముదురుతూ ఉండడం, పోలీసులు నోటీసులు జారీ చేసే వరకూ వచ్చింది విషయం. దీంతో తన ఇమేజ్ కు ఇప్పటికి జరిగిన డ్యామేజ్ చాలనుకున్న కుర్ర కంపోజర్‌ అనిరుధ్.. అట్టకేలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. పోలీసులు ఇచ్చిన ఆదేశాల మేరకు, వారు కోరిన గడవులోగానే స్టేషన్ కు వచ్చాడు అనిరుధ్. కోయంబత్తూర్ లోని రేస్ కోర్స్ క్లబ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది, వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు ఈ సంగీత దర్శకుడు. "అందరికీ కృతజ్ఞతలు, పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కోయంబత్తూర్ స్టేషన్ కు వ్యక్తిగతంగా హాజరయ్యా "బైట్ అన్నాడు అనిరుధ్.

పోలీసులు ఇచ్చిన గడువులోగా స్టేషన్ కు చేరుకునేందుకు.. లండన్ నుంచి బెంగళూర్ చేరుకుని... అక్కడి నుంచ ఓ లాయర్ ను వెంటబెట్టుకుని, పోలీస్ స్టేషన్ కి వచ్చాడట అనిరుధ్. మరోవైపు.. ప్రధాన నిందితుడు శింబు కోసం కూడా ఇలాంటి నోటీసునే పోలీసులు జారీ చేసినా.. అతగాడు ఇంకా హాజరకు కాలేదు. పోలీసుల ముందుకు వచ్చేందుకు మరిన్ని రోజులు గడవు ఇవ్వాలని శింబు తరఫు లాయర్ కోరడంతో.. అనుమతి ఇచ్చారు పోలీసులు.