Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి కోసం స్పెషల్ సాంగ్

By:  Tupaki Desk   |   8 Dec 2017 10:28 PM IST
అజ్ఞాతవాసి కోసం స్పెషల్ సాంగ్
X
ఒక ఇండస్ట్రీకి పరభాషా సంగీత దర్శకుడు తొలిసారి అడుగుపెడితే అది ఒక ముద్రలా ఫిక్స్ అయిపోవాలని చూస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఛాన్స్ దొరకడంతో అనిరుధ్ తన శక్తికి మించిన స్థాయిలో వర్క్ చేస్తున్నాడు. తన టాలెంట్ మొత్తం ఒక్కసారిగా సౌత్ జనాలకి మరో కిక్కు ఇవ్వాలని పాటలను కంపోజ్ చేస్తున్నాడు.

అజ్ఞాతవాసి సినిమా కోసం ఇప్పటికే బైటికొచ్చి చూస్తే.. అనే సాంగ్ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. స్వీట్ మెలోడిగా వచ్చిన ఆ సాంగ్ పవన్ కళ్యాన్ కి కూడా తెగ నచ్చేసిందట. త్రివిక్రమ్ కథ ప్రకారం మంచి టైమింగ్ లో అనిరుద్ సాంగ్స్ ఇస్తున్నాడట. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఒక ప్రమోషనల్ సాంగ్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యాలని అనుకుంటోందట. అందుకోసం అనిరుధ్ ఒక మంచి బీట్ సాంగ్ తో కూడిన మెలోడి ట్యూన్ ని కంపోజ్ చేస్తున్నాడాట. అయితే ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో మాత్రం ఉండదూ అంటున్నారు.

ఇకపోతే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తెలుగులో అనిరుధ్ మొదటి సాంగ్ కావడంతో ఆడియో లంచ్ ని కూడా నిర్మాత రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్వహించాలని ప్రణాళికలను చేస్తున్నారు. త్వరలోనే ఆ వేడుక జరుగనుంది.. కాకపోతే ఇంకా ఆడియో లాంచ్ డేట్ పై మాత్రం క్లారిటీ రాలేదు.