Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో 'యాటిట్యూడ్'తో ట్రెండ్ అవుతున్న 'యానిమల్' డైరెక్టర్!!
By: Tupaki Desk | 4 Jan 2021 7:00 PM ISTఅర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా నుండి సందీప్ కోసం టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు బాగానే వెయిట్ చేస్తున్నారు. కానీ 2017 నుంచి అర్జున్ రెడ్డితోనే ట్రావెల్ అవుతున్నాడు సందీప్. తెలుగులో రెండో సినిమా చేస్తాడేమో అనుకుంటే.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు ఏమోగానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే తన తదుపరి సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఓ క్రైమ్ ద్రిల్లర్ నేపథ్యంలో సాగే కథను సందీప్ వినిపించడంతో నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సందీప్ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్దంగా ఉన్నారట. ఇదివరకే సందీప్ బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ను తన కథతో మెప్పించాడు. ఈ ఇద్దరి మధ్య సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయిందట.
అసలు క్రైమ్ ఎలా ఉండబోతుందో చూపిస్తానంటూ ఆ మధ్య ఛాలెంజ్ చేసిన సందీప్ తాజాగా 'అనిమల్' అనే పేరుతో చిన్న టీజర్ వదిలాడు. అయితే అందులో 'ది సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్' అనే మార్క్ లైన్ అందరిని ఆకర్షిస్తోంది. అందరూ 'ఏ' అని ఉపయోగిస్తే సందీప్ 'ది' ఎందుకు వాడాడు అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే అది స్వయంగా సందీప్ పెట్టుకున్నదే.. అంతేగాక 'ది సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్' అనేది అతని యాటిట్యూడ్ సూచిస్తుందని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం రన్బీర్, పరిణితి చోప్రాలతో క్రైమ్ డ్రామాను రెడీ చేసి చూపించే పనిలో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. ఇక ఈ సినిమాను T సీరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతనిలతో పాటు సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ వంగా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి 'ది సందీప్' అనేది ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.