Begin typing your search above and press return to search.

అల్లరోడి కోసం అనుష్కను అడిగారట

By:  Tupaki Desk   |   23 July 2015 5:15 PM GMT
అల్లరోడి కోసం అనుష్కను అడిగారట
X
అల్లరి నరేష్ సరసన స్వీటీ అనుష్క నటిస్తే ఎలా ఉంటుంది? ఊహకందని కాంబినేషన్ కదా ఇది. ఐతే ‘జేమ్స్ బాండ్’ సినిమా కోసం ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి నిర్మాత అనిల్ సుంకర గట్టి ప్రయత్నమే చేశాడట. ఐతే అనుష్క ఒప్పుకోకపోవడంతో సాక్షి చౌదరిని ఎంచుకోవాల్సి వచ్చిందట. మామూలుగా చెబితే ఇది పెద్ద రూమర్ అనుకునేవాళ్లు కానీ.. అనిలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అవును. మా కథకు అనుష్క బాగా సూటవుతుందని ఆమెను అడిగాం. ఐతే ఆమె ఫుల్ బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయలేక ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా చాలా పేర్లు పరిశీలించి.. సాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంచుకున్నాం’’ అని అనిల్ వెల్లడించాడు.

జేమ్స్ బాండ్ కథ కొత్తగా ఉంటుందని.. అల్లరి నరేష్ కెరీర్లో కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ గా నిలుస్తుందని అనిల్ అన్నాడు. బాహుబలి ఇంకా బాగా ఆడుతున్నా ‘జేమ్స్ బాండ్’ రిలీజ్ చేయడం రిస్క్ కాదా అని అడిగితే.. ‘‘అదేం లేదు. ఏ సినిమా ప్రేక్షకులు దానికి ఉంటారు. రాబోయే వారాల్లో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. ఈ వారం పోటీగా మరే సినిమా రావట్లేదు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర జేమ్స్ బాండ్ మంచి ఫలితం రాబడుతుందని అనుకుంటున్నాం’’ అని అనిల్ చెప్పాడు. ప్రస్తుతం 14 రీల్స్ బ్యానర్ పై నానితో ఓ సినిమా చేస్తున్నామని.. ఇంకో రెండు కొత్త ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని.. మహేష్ బాబుతో వచ్చే ఏడాది ఓ సినిమా ఉంటుందని అనిల్ వెల్లడించాడు.