Begin typing your search above and press return to search.

మహేష్ అభిమానిని అని చెప్తున్న స్టార్ ప్రొడ్యూసర్

By:  Tupaki Desk   |   5 Oct 2019 6:51 AM GMT
మహేష్ అభిమానిని అని చెప్తున్న స్టార్ ప్రొడ్యూసర్
X
ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆయన తాజాగా నిర్మించిన 'చాణక్య' మూవీ ఈ రోజే విడుదల అయింది. ఆయన తన తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'సరిలేరు నీకెవ్వరు' తీస్తున్నారు. చాణక్య మూవీ ప్రమోషన్స్ లో ఉన్న అనిల్ సుంకర మహేష్ బాబు గురించి, సరిలేరు నీకెవ్వరు మూవీ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా 75% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని - ఇంకా కొన్ని సీన్లు - పాటలు మాత్రమే షూట్ చేయాలని అన్నారు. తాను మహేష్ బాబుకి పెద్ద అభిమానిని అని - మహేష్ తో పని చేస్తే ప్రతి నిమిషం ఆనందంగా ఉంటుందన్నారు. కాసేపు మహేష్ తో గడిపితే మన టెన్షన్స్ అన్నీ పోయి హ్యాపీగా ఉంటామని మహేష్ ని ఆకాశానికెత్తేశారు.

మహేష్ బాబుకి ఈ సినిమాకి 50కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారని అయితే ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కూడా భాగమయ్యాడని - సినిమా విడుదల అయ్యాక వచ్చిన లాభాల నుండి ఎంత వస్తే అంత మహేష్ కి వెళ్తుందని స్పష్టం చేశారు.