Begin typing your search above and press return to search.
ఎఫ్ 3 కి ముందే రామారావు వస్తాడా?
By: Tupaki Desk | 10 May 2020 1:13 PM ISTగత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రంతో.. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్స్ ను దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి మొన్నటి వరకు ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ మద్య తన టీంతో కలిసి ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను.. మూడవ హీరో ఉండక పోవచ్చు అంటూ చెప్పిన విషయం తెల్సిందే. ఎఫ్ 3 స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇటీవలే హైదరాబాద్ కు అనీల్ రావిపూడి వచ్చాడు.
హైదరాబాద్ కు వచ్చిన వెంటనే బాలకృష్ణను అనీల్ కలిశాడట. వీరిద్దరి కాంబోలో సినిమా గత మూడు సంవత్సరాలుగా అనుకుంటున్నారు. అది కాస్త వాయిదా పడుతూ వస్తోంది. ఎఫ్ 3 చిత్రంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ గ్యాప్ లో బాలకృష్ణ తో సినిమాను పూర్తి చేయాలని అనీల్ రావిపూడి అనుకుంటున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ తెరకెక్కుతుంది. కరోనా కారణంగా ఆ షూటింగ్ ఆగింది. లాక్ డౌన్ ఎత్తి వేసి షూటింగ్స్ కు అనుమతిస్తే రెండు నెలల్లో బోయపాటి మూవీని బాలయ్య పూర్తి చేయబోతున్నాడట.
బోయపాటి మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో రామారావు చిత్రాన్ని బాలయ్య చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి మద్య జరుగుతున్న కథా చర్చలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్యకు దర్శకుడు అనీల్ రావిపూడి వీరాభిమాని అంటారు. బాలయ్యను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా అనీల్ రావిపూడి చూపిస్తాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. అందుకే బాలకృష్ణ తో అనీల్ తీయబోతున్న రామారావు సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామారావు సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశం ఉందని.. ఆ తర్వాత ఎఫ్ 3ని మొదలు పెట్టి 2022లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో అనీల్ ఉన్నాడట.