Begin typing your search above and press return to search.

మహేష్‌ పిలుపు కోసం వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   23 Nov 2020 8:30 AM IST
మహేష్‌ పిలుపు కోసం వెయిటింగ్‌
X
మహేష్‌ బాబుతో ఒక్క సినిమా చేసినా చాలు అని చాలా మంది దర్శకులు అనుకుంటూ ఉంటారు. అలాంటిది కొంత మంది దర్శకులకు మాత్రం మహేష్‌ బాబు మళ్లీ మళ్లీ ఆఫర్లు ఇస్తూనే ఉంటాడు. ఆయనకు నచ్చితే.. సక్సెస్‌ లు ఇస్తాడనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా రెండు మూడు సార్లు నటించేందుకు కూడా మహేష్‌ ఓకే చెప్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని మహేష్‌ కు కట్టబెట్టిన అనీల్‌ రావిపూడి మరో ఆఫర్‌ ను దక్కించుకున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. అనీల్‌ మంచి కథతో వస్తే మరో సినిమాలో నేను నటించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ మహేష్‌ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్‌ మాట ఇవ్వడంతో అనీల్‌ మరో కథతో సిద్దం అయ్యాడు.

నేడు అనీల్‌ రావిపూడి పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్‌ బాబుతో మరో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఇప్పటికే మహేష్‌ కోసం కొత్త కథను సిద్దం చేశాను. ఆయన ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి కథ చెప్పేందుకు సిద్దంగా ఉన్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ అనీల్‌ పేర్కొన్నాడు. వచ్చే నెల లేదా జనవరి నుండి వెంకీ మరియు వరణ్‌ లతో ఈయన ఎఫ్‌ 3 మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

మినిమం గ్యాంరెంటీ అంటూ పేరు దక్కించుకున్న అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటే వెంటనే మహేష్‌ బాబు నుండి పిలుపు వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల వారి టాక్‌. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాదిలో మహేష్‌ తదుపరి సినిమా అనౌన్స్‌ మెంట్‌ ఉంటుంది. రాజమౌళితో మహేష్‌ సినిమా చేయాల్సి ఉంది. అది మొదలు అయితే రెండేళ్ల వరకు కొత్త సినిమాలకు కమిట్‌ మెంట్‌ అయ్యేది ఉండదు. మరి అనీల్‌ రావిపూడికి మహేష్‌ ఎప్పుడు టైం ఇస్తాడు అనేది చూడాలి.