Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ పై కన్నేసిన ఎనర్జిటిక్ హీరో

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:30 PM GMT
హ్యాట్రిక్ పై కన్నేసిన ఎనర్జిటిక్ హీరో
X
ఎనర్జిటిక్ హీరో అనగానే రామ్ మాత్రమే గుర్తుకొస్తాడు. యాక్టింగ్ నుంచి డ్యాన్స్ వరకూ రామ్ చూపించే ఎనర్జీ లెవెల్స్ మరెవరి వల్లా సాధ్యం కాదన్న మాట అక్షరాలా నిజం. మరి రామ్ ఇప్పటికి 'నేను..శైలజ'తో ఒక హిట్ మాత్రమే కొట్టినపుడు... అపుడే హ్యాట్రిక్ ఎలా అనే డౌట్ రావడం సహజం.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఓ కొత్త సినిమా ప్రారంభించాడు. తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో.. ఇది గ్యారంటీగా హిట్ అవుతుందని రామ్ నమ్మకం. దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై కూడా రామ్ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు పటాస్, సాయి ధరం తేజ్ కు సుప్రీమ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. రామ్ నటించేందుకు అంగీకరించాడని సమాచారం.

తను తీసిన మొదటి రెండు చిత్రాలతోనూ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. రామ్ తో చేయనున్న చిత్రం కోసం రూట్ మార్చాడు. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలనే తీసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీని డీల్ చేయనున్నాడట. ఇప్పటికే రామ్ కు స్టోరీ చెప్పడం, అటునుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం పూర్తవగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కు కూడా రెడీ అవుతున్నారట. రామ్ ఇప్పుడు చేస్తున్న చిత్రంతోపాటే.. దీన్ని కూడా ఒకేసారి షూటింగ్ చేసే అవకాశాలున్నాయని టాక్.