Begin typing your search above and press return to search.

మహేష్ 26 - ఒక్కడు సెంటిమెంట్

By:  Tupaki Desk   |   27 April 2019 3:01 PM IST
మహేష్ 26 - ఒక్కడు సెంటిమెంట్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు పాతిక సినిమాలు చేసినా అందులో ఒక్కడు మాత్రం అభిమానులకు చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది . ముఖ్యంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజ్ ను లాగిపెట్టి కొట్టే సీన్ ని ఎవరు మరచిపోగలరు. అదే లొకేషన్ లో ఎన్ని షూటింగులు జరిగినా ఇదే అందరికి గుర్తుండిపోయింది. ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే మహేష్ 26 కోసం ప్రస్తుతం కర్నూల్ తో పాటు చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల వేట కొనసాగుతోంది. టీంలోని కీలక సభ్యులు ఇప్పుడు అదే పని మీదున్నారు. ఒక్కడు షూట్ చేసిన బురుజు దగ్గర అనిల్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుని తన కథకు అనుగుణంగా ఏవి సెట్ అవుతాయో ప్లానింగ్ చేసుకుంటున్నట్టు తెలిసింది

సో మహేష్ 26లో రాయలసీమ నేపధ్యం ఉంటుందన్న క్లారిటీ వచ్చేసింది. కాకపోతే కథలో భాగంగా వస్తుందా లేక ఒక్కడు తరహలో సగం బ్యాక్ డ్రాప్ సీమలో ఉంటుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది. జూన్ మొదటి వారంలో జరిగే షెడ్యూల్ కోసం మహేష్ ఇక్కడికి రాబోతున్నాడు. దీనికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు టీంకు కావాల్సిన వసతులు సౌకర్యాలు గురించి కూడా ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఏకధాటిగా జరిపే షూటింగ్ తో దీన్ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. భరత్ అనే నేను- మహర్షి తర్వాత దేవిశ్రీ ప్రసాద్ వరసగా దీనికీ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. షూటింగ్ లాంచనంగా ప్రారంభించే రోజున సాంకేతిక వర్గంతో పాటు మిగిలిన నటీనటుల వివరాలు తెలియజేయనున్నారు. సరిలేరు నీకెవ్వరు అంటే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే టాక్ ఉంది.