Begin typing your search above and press return to search.

ఇతగాడు కూడా రవితేజ దగ్గరికే

By:  Tupaki Desk   |   9 May 2016 9:27 AM GMT
ఇతగాడు కూడా రవితేజ దగ్గరికే
X
వేరే హీరోలతో సినిమా తీశాక.. సరైన బ్రేక్‌ రాకపోయినా.. అది సాలిడ్‌ హిట్‌ కాకపోయినా.. మనోళ్ల ముందు కనిపించే ఒకేఒక్క ఆప్షన్‌ రవితేజ. మొన్ననే సంపత్‌ నంది బెంగాళ్‌ టైగర్‌ తీశాడు. అంతకుముందు గోపిచంద్‌ మలినేని కూడా.. సినిమాలు తేడా పడటంతో బలుపు తీశాడు. ఇలా రొటీన్‌ కమర్షియల్‌ కథలను నమ్ముకునే దర్శకులందరూ.. తేడా కొట్టేసినప్పుడల్లా మాస్‌ రాజాపైనే ఆధారపడుతుంటారు.

ఇప్పుడు ''సుప్రీమ్‌'' సినిమాతో తన కెరియర్‌ లో సెకండ్‌ హిట్‌ కొట్టాడని దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి అందరూ తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. కాని నిజానికి విమర్శకులకు సినిమా అంతగా నచ్చలేదు. ఎందుకంటే మనోడు యాజిటీజ్ గా ''పటాస్‌'' సినిమా ఫ్రేమ్‌ వర్క్‌ ను కాపీ పేస్టు చేసి.. దానిలో కొత్త సీన్లు ఇరికించాడంతే. కొన్ని క్యారెక్టర్లను తారుమారు చేశాడు. కామెడీ మనోడి ఆయువుపట్టు కావడంతో.. అవి మాత్రం కొత్తగా రాసుకున్నాడు. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్‌ హీరోలెవరూ వెంటనే అనిల్‌ రావిపూడితో సినిమా చేయడానికి సిద్దంగా లేరు.

దానితో మనోడు కూడా జై బోలో రవితేజ అంటున్నాడట. ఇప్పటికే రవికి ఒక లైన్‌ చెప్పేసి.. దాని మీద వర్కవుట్‌ చేయడం స్టార్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. పైగా రవితేజ కూడా ఒక్క సినిమా కూడా మొదలు పెట్టకుండా ఖాళీగా కూర్చున్నాడు. సో.. అనిల్‌ సినిమాను ముందుగా చేసేస్తాడేమో.. చూడాలి మరి.