Begin typing your search above and press return to search.

అనీల్‌ అడగాలే కాని బాలయ్య కాదంటాడా!

By:  Tupaki Desk   |   21 Dec 2020 5:01 PM IST
అనీల్‌ అడగాలే కాని బాలయ్య కాదంటాడా!
X
టాలీవుడ్‌ లో నూరు శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్న అతి కొద్ది మంది దర్శకుల్లో అనీల్ రావిపూడి ఒకరు అనడంలో సందేహం లేదు. వరుసగా సూపర్‌ హిట్ లను అందుకుంటున్న అనీల్ రావిపూడి చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణతో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు.

కట్‌ చేస్తే అనీల్‌ రావిపూడి ప్రస్తుతం స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం సిద్దంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అనీల్ రావిపూడి అడిగితే బాలకృష్ణ కాదంటాడా.. ఇటీవల వీరిద్దరి మద్య చర్చలు జరిగాయని త్వరలోనే మూవీ ఉంటుందని అంటున్నారు.

దర్శకుడు అనీల్‌ రావిపూడి సినిమాల మేకింగ్‌ విషయంలో చాలా స్పీడ్‌ గా ఉంటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేశాడనే టాక్‌ ఉంది. అలాంటి అనీల్ త్వరలో ప్రారంభించబోతున్న 'ఎఫ్‌ 3' సినిమాను కూడా నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అంటే వచ్చే సమ్మర్‌ తర్వాత అనీల్ మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అది బాలకృష్ణతోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వీరిద్దరి కాంబోలో సినిమా మహా మాస్ అన్నట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న బిబి3 సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బాలయ్యతో అనీల్ రావిపూడి చేసే ఎంటర్‌ టైన్‌ మెంట్ 2022 సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.