Begin typing your search above and press return to search.

'రామారావు గారు' ఎటెళ్లి పోయారు?

By:  Tupaki Desk   |   8 March 2016 5:46 PM GMT
రామారావు గారు ఎటెళ్లి పోయారు?
X
పటాస్ మూవీతో అరంగేట్రంలోనే హిట్ కొట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ వెంటనే సాయిధరం తేజ్ తో సినిమా స్టార్ట్ చేసేసి, డిమాండ్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఓ సూపర్బ్ టైటిల్ కం స్టోరీతో నందమూరి నటసింహం బాలకృష్ణను కూడా అప్రోచ్ అయ్యాడు. తన వందో సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని భావిస్తున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి చెప్పిన 'రామారావు గారు' టైటిల్ కం స్టోరీ విపరీతంగా నచ్చడంతో.. డెవలప్ చేసి తీసుకురావాల్సిందిగా చెప్పారు.

దీంతో బాలయ్య వందో సినిమా తీయబోయేది తనేనంటూ ఇండస్ట్రీలో చెప్పేసుకున్నాడు ఈ డైరెక్టర్. కానీ ఇప్పుడు బాలయ్య తన వందో సినిమాని కృష్ణవంశీ కానీ, క్రిష్ కానీ డైరెక్ట్ చేస్తారని చెప్పేస్తున్నారు. అలాగే 101వ సినిమాగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఆదిత్య 999 ఉంటుందనే న్యూస్ కూడా దాదాపు కన్ఫాం అయిపోయింది. ఈ రెండూ కంప్లీట్ అయి, రిలీజ్ అవడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. మరి అనిల్ రావిపూడి సంగతేంటి అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఇప్పటికున్న టాక్ ప్రకారం 'రామారావు గారు' సంగతిని బాలయ్య పట్టించుకోవడం లేదట. అంటే అనిల్ రావిపూడికి బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ లేనట్లే అని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్ అటకెక్కేసినట్లే అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి అనిల్ రావిపూడి.. ఈ స్టోరీని వేరే వాళ్లతో తీస్తానంటాడో.. బాలయ్య చేసే వరకూ వెయిట్ చేస్తానంటాడో!