Begin typing your search above and press return to search.
అనీల్ రావిపూడి మరో ప్రయోగం
By: Tupaki Desk | 18 Nov 2020 12:45 PM ISTమినిమం గ్యారెంటీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న అనీల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాలో హీరో రవితేజను గుడ్డి వాడిగా చూపించాడు. సాదారణంగా అయితే మన తెలుగు ప్రేక్షకులు హీరో అంగవైకల్యంతో ఉంటే ఒప్పుకోరు. కాని ప్రేక్షకులను అనీల్ రావిపూడి ఒప్పించాడు. తనదైన శైలి ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను మెప్పించిన అనీల్ రావిపూడి వరుసగా సూపర్ హిట్ లను అందుకుంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ వెంటనే ఎఫ్ 3 మొదలు పెట్టాలనుకున్నా కూడా కరోనా కారణంగా ఆయన ప్లానింగ్ మొత్తం రివర్స్ అయ్యింది.
తన సినిమాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇతర సినిమాలకు రచన సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాడు. ఇటీవల ప్రారంభం అయిన 'గాలి సంపత్' సినిమాకు అనీల్ రావిపూడి రచన సహకారం అందిస్తున్న విషయం తెల్సిందే. స్క్రీన్ ప్లే అందిస్తున్న కారణంగా అనీల్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రకు గాను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించనున్నాడు.
మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మూగవాడిగా కనిపించబోతుంది. రాజా ది గ్రేట్ లో హీరోను కళ్లు లేని వాడిగా చూపించిన అనీల్ ఈసారి హీరో తండ్రిని మూగవాడిగా చూపించే ప్రయత్నం చేసి ప్రయోగం చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది మరియు అనిల్ స్నేహితుడు ఎస్. క్రిష్ణ (ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనీల్ రావిపూడి రచన సహకారం అందిస్తున్న సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.