Begin typing your search above and press return to search.

సుధీర్ బాబుగారా? సుధీర్ బావగారా? : అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   22 Aug 2021 3:45 AM GMT
సుధీర్ బాబుగారా? సుధీర్ బావగారా? : అనిల్ రావిపూడి
X
సుధీర్ బాబు - ఆనంది జంటగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ - ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజా .. ఇంద్రగంటి మోహనకృష్ణ .. అనిల్ రావిపూడి .. కార్తికేయ .. రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేదికపై తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో వస్తున్న దర్శకులు టైటిల్స్ ను చాలా కొత్తగా పెడుతున్నారు. చాలా కాలం క్రితం మరిచిపోయిన 'సోడా'ను ఈ సినిమా టైటిల్ తో గుర్తుచేశారు. అప్పట్లో సోడా తాగితే భలే మజా వచ్చేది. మొదటి నుంచి కూడా సుధీర్ బాబు డిఫరెంట్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. తనపై తనకి గల పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్లే హీరోల్లో ఆయన ఒకడు. ఇక కరుణకుమార్ ఇంతకు ముందు 'పలాస' సినిమాను నా ఆధ్వర్యంలో చేశాడు. ఆయన కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే దర్శకుడే.

కమర్షియల్ హీరో అయిన సుధీర్ బాబు .. కరుణకుమార్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే, ఇంకా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన ఒకటి ఆయనలో కనిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా బాగుంటుంది. మణిశర్మ చరిత్ర సృష్టించిన సంగీత దర్శకుడు. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకి పనిచేశాడు. అలాంటి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి మాటాడుతూ .. 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది అర్థమైపోతోంది. అందుకే నిర్మాతలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 'భలే మంచి రోజు' .. 'ఆనందో బ్రహ్మ' .. 'యాత్ర' వంటి మంచి సినిమాలు వారి బ్యానర్ నుంచి వచ్చాయి. ఇక దర్శకుడు కరుణకుమార్ గారు గతంలో చేసిన 'పలాస' సినిమా మాదిరిగానే, ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమాకి మరో మెయిన్ పిల్లర్ మణిశర్మగారు అనే చెప్పాలి .. ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఎంతోమంది హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ప్రతి సినిమాపై ఆయన తనదైన ముద్రవేశారు. అలాంటి ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మన సుధీర్ బావ గారు .. బాబు గారా? బావగారా? మహేశ్ కి బావగారైతే మనందరికీ బావగారే. అలాంటి సుధీర్ బాబుగారు ఆల్ రౌండర్ అనే చెప్పాలి. మంచి నేపథ్యం ఉన్నప్పటికీ తానేమిటనేది నిరూపించుకోవడానికి ప్రతి సినిమాకి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో తనకి మంచి హిట్ పడాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమాలన్నీ కూడా బాగా ఆడాలనీ .. బాక్సాఫీస్ దద్దరిల్లిపోవాలని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.