Begin typing your search above and press return to search.

రేటు పెంచేసిన అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   11 Jun 2016 9:30 AM GMT
రేటు పెంచేసిన అనిల్ రావిపూడి
X
బెల్లం చుట్టూనే ఈగ‌లు వాల‌తాయి. డిమాండ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి. ఈ సూత్రం ఏ రంగంలో అయినా కామ‌న్‌. ఇక సినిమా రంగంలో ఇది మ‌రీ ఎక్కువ‌. టాలీవుడ్ హీరోల నుంచి హీరోయిన్లు - టెక్నీషీయ‌న్ల వ‌ర‌కు డిమాండ్‌ కు త‌గ్గ‌ట్టుగా భారీగానే రేట్లు వ‌సూలు చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే రెండు వ‌రుస హిట్లు ఇచ్చి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌ గా త‌న‌కు తాను ఫ్రూవ్ చేసుకున్న ఓ కుర్ర డైరెక్ట‌ర్ ఇప్పుడు త‌న రెమ్యున‌రేష‌న్‌ ను ఏకంగా మూడు రెట్లు పెంచేశాడు. ఈ విష‌యం ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో బాగా ట్రెండ్ అవుతోంది.

అనిల్ రావిపూడి ఈ డైరెక్ట‌ర్ పేరు గ‌తేడాది జ‌న‌వ‌రి 23వ తేదీ మ‌ధ్యాహ్నానికే టాలీవుడ్‌ లో ఒక్క‌సారిగా స్ప్రెడ్ అయ్యింది. ద‌శాబ్దకాలంగా స‌రైన హిట్‌ లేని నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌ రామ్‌ కు ప‌టాస్‌ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు. ప‌టాస్‌ తో ట‌పాసులు పేల్చి తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన అనిల్... టాలీవుడ్ డైరెక్ట‌ర్ల పాలిట బ్యాడ్ సెంటిమెంట్‌ గా ఉన్న ద్వితీయ విఘ్నాన్ని కూడా స‌క్సెస్ ఫుల్‌ గా అధిగ‌మించాడు.

మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో అనిల్ తీసిన సుప్రీమ్ మూవీ కూడా క‌మ‌ర్షియ‌ల్‌ గా మంచి హిట్ అయ్యింది. దీంతో అనిల్‌ కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ‌కు కూడా రామారావు గారు టైటిల్‌ తో అనిల్ ఓ స్టోరీ చెప్పినా బాల‌య్య వందో సినిమా క్రిష్ చేతుల్లోకి వెళ్ల‌డంతో అనిల్‌ కు తృటిలో బాల‌య్య వందో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ త‌ప్పిపోయింది.

ఇదిలా ఉంటే అనిల్ ఇప్పుడు త‌న మూడో సినిమాను యంగ్ య‌న‌ర్జిటిక్ హీరో రామ్‌ తో తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే త‌రువాయి అని తెలుస్తోంది. ఈ చిత్రానికి తన రెమ్యూనరేషన్ గా అనిల్ సుమారు మూడు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ప‌టాస్‌ కు రూ.కోటి తీసుకున్న అనిల్ రెండు వ‌రుస హిట్లు రావ‌డంతో ఇప్పుడు ఏకంగా త‌న రెమ్యున‌రేష‌న్‌ను మూడు కోట్ల‌కు పెంచేశాడు.