Begin typing your search above and press return to search.

ఆ మల్టిస్టారర్ పై పెదవి విప్పుతాడట

By:  Tupaki Desk   |   14 March 2018 10:17 AM GMT
ఆ మల్టిస్టారర్ పై పెదవి విప్పుతాడట
X
కందిరీగ మరియు అలా మొదలైంది లాంటి సూపర్ హిట్ సినిమాలకి డైలాగులు అందించిన అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో డైరెక్టరుగా మారాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించేసుకున్న అనిల్ తరువాత సినిమాలు సుప్రీమ్, రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్లు అవ్వడంతో హాట్ట్రిక్ సంపాదించి తన తడాఖా చూపించేశాడు.

మరి అనిల్ రావిపూడి ఇప్పుడేం చేస్తున్నాడు? ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ తో మల్టిస్టారర్ గా మన ముందు రాబోతోంది ఈ సినిమా. ఇప్పటిదాకా వైజాగ్ లో ఉండి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడంలో బిజీగా గడిపాడు అనిల్. ఆ స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి రావడంతో తిరిగి హైదరాబాద్ చేరుకుని వరుణ్, వెంకీలకు స్క్రిప్ట్ వినిపించాడు. వారిద్దరూ కూడా ఓకే చెప్పేయడంతో ఇంకా షూటింగ్ మొదలవ్వడం ఒకటే ఆలస్యం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన మార్చ్ 18న ఇవ్వబోతున్నారట. ఆ రోజే ఈ సినిమా గురించి అనిల్ పెదవి విప్పుతాడట.

కానీ రెగులర్ షూటింగ్ మాత్రం జూన్ ఆఖరి వారంలో మొదలయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా హీరోయిన్లు ఎవరో తెలియట్లేదు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎఫ్2 ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించబోతోంది.